తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవాగ్జిన్'​ టీకా  సమర్థవంతం.. భద్రతకే ప్రాధాన్యం

కొవిడ్​-19 టీకా 'కొవాగ్జిన్​' సమర్థవంతమైందని ప్రకటించింది.. తయారీ సంస్థ భారత్​ బయోటెక్​. దేశీయంగా తయారవుతున్న తొలి కోవిడ్ టీకాను భారత్ బయోటెక్ రూపొందిస్తోంది. టీకా అభివృద్ధిలో భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని చెబుతోంది. రెండు డోసులు తీసుకున్న తర్వాత వాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది. విభిన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్​ సామర్థ్యం తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ఈ ట్రయల్స్​ జరుగుతున్నాయి.

COVAXIN
కొవిడ్​-19 టీకా 'కొవాగ్జిన్​'

By

Published : Dec 5, 2020, 4:44 PM IST

Updated : Dec 5, 2020, 8:04 PM IST

హైదరాబాద్​కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్​ బయోటెక్​ రూపొందించిన కరోనా వ్యాక్సిన్​ 'కొవాగ్జిన్​' ప్రస్తుతం తుది దశ ప్రయోగాల్లో ఉంది. తమ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. రెండో డోస్ ఇచ్చిన 14 రోజుల తర్వాత నుంచి వాక్సిన్ సమర్థతను గుర్తిస్తామని తెలిపింది. ఈ క్రమంలో కొవాగ్జిన్​ అభివృద్ధి, ట్రయల్స్​ ప్రక్రియ, సంస్థ ట్రాక్​ రికార్డ్​ గురించి తెలుసుకుందాం.

  • కొవాగ్జిన్​ క్లినికల్​ ట్రయల్స్​ను ప్రధానంగా 2-డోస్​ల​ షెడ్యూల్​ ఆధారంగా నిర్వహిస్తారు. రెండు మోతాదులను 28 రోజుల వ్యవధిలో అందిస్తారు. రెండో డోస్​ అందించిన 14 రోజుల తర్వాత వ్యాక్సిన్​ సమర్థతను లెక్కిస్తారు.
  • మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​లో 50 శాతం వలంటీర్లకు టీకా అందించగా.. 50 శాతం మందికి ప్లేసిబో (మాత్రలు) ఇస్తారు. సీడీఎస్​సీఓ-డీసీజీఐ మార్గదర్శకాల మేరకు టీకా ప్రతికూలతలను నివేదిస్తారు.
  • టీకా తీసుకున్న వారిని పరిశీలించి వ్యాక్సిన్​ ప్రతికూలతలను తెలుసుకుంటారు రోగి పరిశీలకులు(పీఐ). ఆయా నివేదికలను సీడీఎస్​సీఓ-డీసీజీఐ ఆధ్వర్యంలోని విలువల కమిటీకి సమర్పిస్తారు.

కొవాగ్జిన్​ అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కొవిడ్​-19 వ్యాక్సిన్​. దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా విభిన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్​ సమర్థతను తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ట్రయల్స్​ నిర్వహిస్తున్నారు.

20 ఏళ్ల ప్రస్థానంలో..

కొవాగ్జిన్​ను అభివృద్ధి చేసిన భారత్​ బయోటెక్​ 20 ఏళ్ల ప్రస్థానంలో.. 18 దేశాల్లో సుమారు 6 లక్షల మందిపై 80కిపైగా క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించిన అనుభవం ఉంది. ఆక్​ఫర్డ్​ విశ్వవిద్యాలయంలో మానవ సవాళ్లపై అధ్యయనం చేసే కొన్ని సంస్థల్లో భారత్​ బయోటెక్​ ఒకటి. ఈ సంస్థ అమెరికా, బ్రిటన్​లోనూ ఇతర క్లినికల్​ ట్రయల్స్​ను నిర్వహించింది. సురక్షితమైన వ్యాక్సిన్లు అందించిన రికార్డ్​తో ఇప్పటి వరకు 80 దేశాలకు 4 బిలియన్​ డోస్​లను సరఫరా చేసింది భారత్​ బయోటెక్​. వ్యాక్సిన్ల అభివృద్ధిలో భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొంటోంది.

అనిల్​ విజ్​కు​ కరోనా

హరియాణా మంత్రి అనిల్​ విజ్​ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు. నవంబర్​ 20న అనిల్​ విజ్​ వలంటీర్​గా కొవాగ్జిన్​ తీసుకున్నారు. 15రోజుల తర్వాత ఆయనకు వైరస్​ సోకగా.. అంబాలాలోని సివిల్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన టీకా మొదటి డోస్​ మాత్రమే తీసుకున్నారు. "కోవాగ్జిన్ రెండు డోసుల్లో తీసుకున్న కొన్ని రోజుల తర్వాత యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని .. అనిల్ విజ్ కేవలం ఒక డోస్ వాక్సిన్ మాత్రమే ఇప్పటి వరకూ తీసుకున్నారని" కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు అంబాలా ఆస్పత్రి వైద్యుడు డా. కుల్దీప్ సింగ్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తొలి డోసు తీసుకున్న 15 రోజుల తర్వాతే యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయని చెప్పారు. మంత్రి అనిల్ విజ్.. కేవలం ఒకే డోసు తీసుకున్నారని తెలిపారు.

"తొలి డోసు తీసుకున్న 15 రోజుల్లోపే యాంటీబాడీలను ఏ టీకా ఉత్పత్తి చేయలేదు. నవంబర్ 20న మంత్రి కొవాగ్జిన్ తొలి డోసు స్వీకరించారు. ఈరోజు డిసెంబర్ 5. నేటికి సరిగ్గా 15 రోజులు. రెండు డోసులు అందిస్తే.. 42 రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీలు నిలకడ సాధిస్తాయి."

-డా. కుల్దీప్ సింగ్, అంబాలా ఆస్పత్రి సివిల్ సర్జన్

డిసెంబర్ 18న అనిల్ విజ్​కు రెండో డోసు ఇవ్వాల్సి ఉంది.

ఇదీ చూడండి:భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్​ ప్రయోగాలు ఇలా..

Last Updated : Dec 5, 2020, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details