తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా: కేరళ విద్యార్థిని సేఫ్​.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి - కరోనా దేశంలో తొలి కేసు

దేశంలో తొలి కరోనా కేసు బాధితురాలు అయిన కేరళ విద్యార్థిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్​గా వచ్చినందున ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్యులు స్పష్టం చేశారు.

Coronavirus patient discharged from Kerala hospital, in home quarantine
కరోనా: ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న కేరళ విద్యార్థిని

By

Published : Feb 13, 2020, 7:44 PM IST

Updated : Mar 1, 2020, 6:03 AM IST

దేశంలో తొలి కరోనా బాధితురాలైన కేరళ విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది. తాజాగా మరోసారి ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో వైరస్​ నెగెటివ్​గా వచ్చినందున ఆసుపత్రి నుంచి ఆమెను డిశ్చార్జి​ చేసినట్లు వైద్యులు వెల్లడించారు.

తొలి కరోనా బాధితురాలు...

కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన విద్యార్థినికి చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ సోకింది. స్వదేశానికి వచ్చిన ఆమెకు కరోనా ఉందని తేలింది. అప్పటి నుంచి ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందించారు. ఎప్పటికప్పుడు విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన వైద్యులు.. ఆమెకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్‌ నెగెటివ్‌గా వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఇంటికి పంపించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

ఇప్పటి వరకు కేరళలో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఒకరు డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లారు. మిగిలిన ఇద్దరిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి: కేజ్రీవాల్​ ప్రమాణస్వీకారానికి 'బుల్లి కేజ్రీవాల్​'

Last Updated : Mar 1, 2020, 6:03 AM IST

ABOUT THE AUTHOR

...view details