తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనాను ఎదుర్కొనేందుకు సౌకర్యాలు పెంచండి' - Corona Effect in India

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనాను ఎదుర్కొనేందుకు చర్యలను ముమ్మరం చేసింది భారత్​. ఎయిమ్స్​ సహా ఇతర ప్రధాన వైద్య సంస్థల్లో సౌకర్యాలను పెంచాలని సూచిస్తూ ఆయా అధికారులకు సిఫార్సులు జారీ చేసింది కేంద్రం.

AIIMS asked to designate part of new emergency wing for setting up isolation beds
కరోనాను ఎదుర్కొనేందుకు సౌకర్యాలు పెంచండి

By

Published : Mar 8, 2020, 6:56 PM IST

Updated : Mar 8, 2020, 11:04 PM IST

'కరోనాను ఎదుర్కొనేందుకు సౌకర్యాలు పెంచండి'

వేగంగా విస్తరిస్తోన్న కొవిడ్​-19(కరోనా వైరస్​)ను ఎదుర్కొనేందుకు కేంద్రం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా.. ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.. ఎయిమ్స్​కు సూచించింది. తన పరిధిలోని జై ప్రకాశ్​ నారాయణ్​ అపెక్స్​ ట్రౌమా కేంద్రం​లో ఓ అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఎయిమ్స్​ యంత్రాంగానికి సిఫార్సు చేసింది. ఈ విభాగంలోనే ఐసోలేషన్ వార్డును​ కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

ఈ వార్డుల్లో ఏకకాలంలో 20మందికి చికిత్స అందించే వీలుంటుంది. కరోనా పాజిటివ్​ అని తేలిన అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం జాతీయ క్యాన్సర్​ విభాగం(ఎన్​సీఐ) జాజ్​హర్​కు తరలిస్తారని సమాచారం. ఎన్​సీఐ జాజ్​హర్​ విభాగంలో ప్రస్తుతమున్న పడకల సామర్థ్యాన్ని 25 నుంచి 125కు పెంచాలని సూచించింది.

అయితే కరోనా బాధితులుండే అంబులెన్స్..​ ఆసుపత్రికి చేరుకోవడానికి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు అధికారులు.

జిప్​మర్​కు కూడా...

ఎయిమ్స్​ సహా పుదుచ్చేరి- జిప్​మర్​కు కూడా కొన్ని సిఫార్సులు చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. ఐసోలేషన్​ వార్డులోని పడకలను 12 నుంచి 15కు పెంచాలని సూచించింది. అవసరాన్ని బట్టి.. వీటిని 30 వరకు పెంచే ఏర్పాట్లు చేయాలని కోరింది.

బృందాల ఏర్పాటుకు సూచన...

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల్లోని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులను అప్రమత్తం చేసింది కేంద్రం. కేసుల విషయంలో వేగంగా స్పందించాలని ఆదేశించింది. ప్రతి 3 కిలోమీటర్లకు రాపిడ్​ రెస్పాన్స్​ టీమ్​ను ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టాలని అభ్యర్థించింది. దగ్గు, జలుబు లక్షణాలున్న అనుమానితులను వెంటనే పరీక్షించి.. వారిని ఇళ్లలోనే నిర్బంధించాలని అధికారులకు స్పష్టం చేసింది.

ఇప్పటివరకు భారత్​లో 40 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 16 మంది ఇటాలియన్లు ఉన్నారు. వీరిలో కేరళలో వైరస్​ బారిన పడి ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్​ అయినవారు ముగ్గురు.

ఇదీ చదవండి:ఈ నెల 12 నుంచి కాంగ్రెస్​ 'గాంధీ సందేశ్​ యాత్ర'

Last Updated : Mar 8, 2020, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details