కరోనా మహమ్మారి వ్యాప్తి దేశంలో అంతకంతకూ పెరిగిపోతుంది. మొత్తం కేసుల సంఖ్య 9,152కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 35మంది చనిపోయారు. వైరస్ కారణంగా ఇప్పటి వరకు మొత్తం 308 మంది ప్రాణాలు కోల్పోయారు. 856మంది వ్యాధి నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
24 గంటల్లో 35 మరణాలు, 796 కొత్త కేసులు - Covid-19 pandemic in india
దేశంలో కరోనా కేసుల సంఖ్య 9,152కు పెరిగింది. 24 గంటల్లో 35 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 308కి చేరింది. వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 856 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో 308కి చేరిన మరణాలు... 9,152 కేసులు
కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 1985కు చేరింది. దిల్లీ, తమిళనాడులో ఆ సంఖ్య 1000 దాటింది.