ETV Bharat / bharat

లాక్‌డౌన్​ అమలు​ చేస్తేనే కరోనా వ్యాప్తి డౌన్‌! - indian lockdown

జనసాంద్రత ఎక్కువగా ఉన్న మన దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమైతే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ఈ నెల 14 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగితేనే వైరస్​ను కట్టడి చేయగలమంటున్నారు నిపుణులు. లాక్​డౌన్​తో పాటు ఆ జాగ్రత్తలు తీసుకుంటే.. దేశం సురక్షితంగా ఉంటుందంటున్నారు. మరి అవేంటో చూసేయండి..

corona lockdown extension in india and its importance
లాక్‌ చేస్తేనే కరోనా వ్యాప్తి డౌన్‌!
author img

By

Published : Apr 13, 2020, 9:04 AM IST

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ఈ నెల 14 తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగించడానికే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌ 30 దాకా లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. మెజారిటీ రాష్ట్రాలూ అదే బాటలో ఉన్నాయి. ఇక కేంద్రం ప్రకటనే రావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ పొడిగింపు ఎందుకు అవసరం?అనే దానిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

జనసాంద్రత ఎక్కువగా ఉన్న మన దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమైతే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉంటుంది. అందుబాటులో ఉన్న వైద్య సేవలు, సౌకర్యాలు, మందులు వంటివి సరిపోకపోవచ్చు. ఎక్కువ ప్రాణనష్టం సంభవించే అవకాశాలు మెండు. కొవిడ్‌కు గురైన వారికి చికిత్సలు అందిస్తూనే.. కొత్తగా సోకిన వారికి వైద్యం అందించడం కష్టమైపోతుంది. అనేక దేశాల్లో ఈ పరిస్థితి కళ్లకు కడుతోంది. ఇటలీ, స్పెయిన్‌లలో వృద్ధులకు వెంటిలేటర్లు చాలక చాలామంది చనిపోయారు. న్యూయార్క్‌లోనూ వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. భారత్‌లో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. లాక్‌డౌనే ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం భౌతిక దూరాన్ని పాటించడం, ఇళ్లలోనే ఉండటం, గుంపులుగా ఒకచోట చేరకుండా చేయడం వంటివి కీలకం.

మెరుగైన ఫలితాలు..

మన దేశంలో మార్చి 24న లాక్‌డౌన్‌ అమలుచేసే నాటికి దాదాపు 500 కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పటికి రోజువారీ కేసుల పెరుగుదల 22 శాతం ఉండేది. లాక్‌డౌన్‌ తర్వాత తొలివారం ఇది 14 శాతానికి తగ్గింది. రెండో వారంలో 17 శాతంగా ఉంది. దీన్నిబట్టి లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వచ్చాయనే విషయం అర్థమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ముందుగానే విధించిన పాతిక దేశాల్లో భారత్‌ ఒకటి. భారత్‌లో ఇది 100 శాతం అమలవుతోంది. లాక్‌డౌన్‌ విధించిన డెన్మార్క్‌, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, న్యూజిలాండ్‌లు కూడా రెండు వారాల్లో మంచి ఫలితాలను సాధించాయి.

చైనా ఏం చేసింది?

చైనాలోని 5 మహా నగరాల్లో ఆంక్షలు విధించాక వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు చెబుతున్నారు. వైరస్‌ ప్రబలిన ప్రారంభంలో ఆంక్షలు లేకపోవడంతో ఒక్కో రోగి నుంచి ఇద్దరు, ముగ్గురికి వ్యాపించింది. చైనాలో లాక్‌డౌన్‌ అద్భుతంగా పనిచేసింది. 4,000 కేసులకు చేరిన తర్వాత ఇలాంటి చర్యలు చేపట్టిన ఇతర దేశాలతో పోలిస్తే చైనా అత్యంత వేగంగా కేసులను తగ్గించగలిగింది.

‘సామాజిక వ్యాప్తి’ దశకు చేరకుండా..

భారత్‌లో కేసుల సంఖ్య 8,000 దాటిపోయింది. అమెరికా వంటి దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. ప్రజలు తమకు ఈ ఇన్‌ఫెక్షన్‌ ఎలా వచ్చిందో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి సామాజిక వ్యాప్తిలో ఉంటుంది. భారత్‌లో ఇంకా ఈ దశ రాకపోవడం కొంత ఊరట. అయితే పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా సామాజిక వ్యాప్తి దశ రాకుండా చేయాలంటే లాక్‌డౌన్‌ను పొడిగించడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

2 ఉపయోగాలు

లాక్‌డౌన్‌ పొడిగింపు వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.

1. కరోనా వ్యాప్తి వేగాన్ని నియంత్రించడం. 2. వైద్య సంరక్షణ విధానంపై అపరిమిత ఒత్తిడిని తగ్గించి, విషమ పరిస్థితుల్లో ఉన్నవారికీ ఆసుపత్రుల్లో తగిన సేవలందించడం. వీటి వల్ల మరణాల రేటును తగ్గించొచ్చు.

corona lockdown extension in india and its importance
లాక్‌ చేస్తేనే కరోనా వ్యాప్తి డౌన్‌!

ఎందుకు పొడిగించాలి?

భారత్‌లో లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో పలు ఇతర దేశాలతో పోలిస్తే వ్యాప్తి కొంత తక్కువగా ఉంది. ఇప్పుడు దాన్ని ఉపసంహరిస్తే కేసులు ఒక్కసారిగా పెరగొచ్చని, కొనసాగింపే ఉత్తమమనేది నిపుణుల అభిప్రాయం. ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితిని లాక్‌డౌన్‌ నివారిస్తుంది. వైద్యసేవలు, వ్యాధి నియంత్రణ పరంగా ప్రణాళిక రచనకు, సన్నద్ధతకు ప్రభుత్వానికి విలువైన సమయాన్ని అందిస్తుంది. వైరస్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ తీరుపై ఒక అంచనాకు రావడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), ఇతర ప్రభుత్వ వ్యవస్థలకు వీలు కలుగుతుంది. ఇన్‌ఫెక్షన్‌ నుంచి ఎంత మంది కోలుకున్నారు? ఇన్‌ఫెక్షన్‌ క్లస్టర్లు ఎక్కడ ఉన్నాయి? వంటి వివరాలను సులువుగా తెలుసుకోవచ్చు. కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా చేపట్టేలా ఒక వ్యూహాన్ని సిద్ధం చేయడానికి, టీకాలు, మందులు అందుబాటులోకి వచ్చేలోగా వైరస్‌ భారీగా వ్యాప్తి చెందకుండా ప్రణాళిక తయారు చేయడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. హాట్‌స్పాట్‌లను గుర్తించి, మిగతాచోట్ల లాక్‌డౌన్‌ను గణనీయంగా సడలించడానికి ఒక కార్యక్రమాన్ని తయారు చేయడానికీ వీలు పడుతుంది. హాట్‌స్పాట్‌లలో ప్రజలను జాగ్రత్తగా కాపాడటానికి, నిర్బంధాన్ని సడలించాక ఇన్‌ఫెక్షన్‌ మరోసారి విజృంభించకుండా చూసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది. వ్యాధి వ్యాప్తి పెరిగినా తట్టుకొనేలా వెంటిలేటర్లు, పడకలు, ఔషధాలు, శిక్షణ పొందిన సిబ్బంది, వారికి అవసరమైన పీపీఈలు తదితర వనరులను సమకూర్చుకోవడానికి వ్యవధి కూడా దొరుకుతుంది. అలాగే ప్రజలు భౌతిక దూరం పాటించకపోతే వైరస్‌ విస్తృతి పెరిగే ప్రమాదం కూడా ఉంది.

ముమ్మాటికీ అవసరమే..

భారత్‌లో లాక్‌డౌన్‌ విధించడం.. దాన్ని కొనసాగించడం ముమ్మాటికీ సరైన నిర్ణయాలే. భౌతిక దూరం పాటించడం, లాక్‌డౌన్‌ ద్వారా కేసుల సంఖ్యను సాధ్యమైనంత మేర తగ్గించే వ్యూహాన్ని భారత్‌, ఆస్ట్రేలియా సహా అనేక ఇతర దేశాలు అనుసరిస్తున్నాయి. నిజానికి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసించాయి. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో నిర్ణయాత్మక నాయకత్వ పటిమను భారత్‌ ప్రదర్శించిందని కొనియాడాయి. లాక్‌డౌన్‌ లేకుంటే 4-7 రోజుల్లోనే ఆస్ట్రేలియాలో కేసుల సంఖ్య రెట్టింపు అవుతుందని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించిన నమూనాలో వెల్లడైంది. 130 కోట్లకుపైగా జనాభా కలిగిన భారత్‌లో.. ఈ లెక్కన కేసులు నమోదైతే పెను నష్టం సంభవిస్తుంది. అలాగని లాక్‌డౌన్‌ శాశ్వత పరిష్కారం కాదు. దీనివల్ల తీవ్రస్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తుంది.

ప్రొఫెసర్‌ శేషాద్రి వాసన్‌

- ప్రొఫెసర్‌ శేషాద్రి వాసన్‌, ముఖ్య శాస్త్రవేత్త, కామన్‌వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఐఆర్‌వో), ఆస్ట్రేలియా

ఆర్థిక వ్యవస్థపై భారం: సీడీడీఈపీ

దేశవ్యాప్తంగా ఎక్కువ రోజుల లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని.. ఆ ప్రభావం సమాజంపై పడకుండా చర్యలు చేపట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల భారత్‌పై ప్రత్యక్ష భారం కొన్ని రూ. లక్షల కోట్లు ఉండొచ్చని.. అందువల్ల ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని అడ్డుకుంటూనే ఆర్థిక వ్యవస్థపై పడే భారాన్ని తగ్గించే అంశంపై దృష్టి సారించాలని చెబుతున్నారు. ‘‘దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల పేదలకు ఆహార కొరత తీవ్రమవుతుంది. ఇన్‌ఫెక్షన్లను తట్టుకునే సామర్థ్యం వారిలో తగ్గిపోతుంది..’’ అని అమెరికాకు చెందిన ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ (సీడీడీఈపీ)’ పేర్కొంది. ఫలానా తేదీ నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్లు ముందే ప్రకటించాలని, ఆలోగా నిబంధనలను క్రమంగా సడలించాలని సూచించింది.

లాక్‌డౌన్‌ అమలుతో పాటు గాలినీ, నేలనూ శుభ్రం చేయాలి

ఈనాడు, దిల్లీ: వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అరికట్టాలంటే లాక్‌డౌన్‌ అమలుతో పాటు గాలిని, నేలను కూడా శుభ్రం చేయాల్సిందే.. యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌(యూకే)లోని జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ శోవన్‌లాల్‌ రాయ్‌ ఇదే సూచిస్తున్నారు. ‘మెడ్‌-ఆర్కైవ్‌’ ప్రచురించిన వ్యాసంలో ఆయన వివిధ అంశాలను వివరించారు. ‘‘కరోనా వైరస్‌ రెండు మార్గాల ద్వారా వ్యాపిస్తోంది. 1. ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రత్యక్షమార్గం. 2.రోగి వాడిన వస్తువులను తాకడం; గాలి, నేలలో కలిసిన వైరస్‌ ద్వారా సంక్రమించడం. ఈ పరోక్ష వ్యాప్తి మార్గాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే గాలిని, బహిరంగ ప్రదేశాలనూ తరచూ శుభ్రం(డిస్‌ఇన్‌ఫెక్ట్‌) చేస్తుండాలి. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ రెండు మార్గాల్లోనూ కొవిడ్‌-19 వ్యాప్తి చెందుతోంది. అయితే రెండోది (నాన్‌కాంటాక్ట్‌ ట్రాన్స్‌మిషన్‌) ఎంతమేర ప్రభావం చూపుతోందన్న విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది. దీన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. లాక్‌డౌన్‌ అమలు చేసినప్పుడు వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఉన్న అన్ని మార్గాలనూ మూసేయడానికి చర్యలు చేపట్టాలి. అలాగే తొందరపాటుతో లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సరికాదు. దీంతో కేసులు భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. రెండు మార్గాల ద్వారా వైరస్‌ వ్యాప్తిని ఎంత విజయవంతంగా నిరోధించగలిగామన్న దాన్నిబట్టి లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ఒక నిర్ణయానికి రావాలి. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత రెండో మార్గంలో వైరస్‌ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది.’’ అని డాక్టర్‌ రాయ్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:నేటి నుంచి తెరుచుకోనున్న మద్యం దుకాణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.