అరుణాచల్‌ప్రదేశ్ ప్రజలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటానగర్ బహిరంగ సభలో ప్రసగించారు రాహుల్. దేశంలోని కొన్ని రాష్ట్రాల పరిస్థితులు, సమస్యల వల్ల వాటికి ప్రత్యేక సహకారం అందించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
"మీకు మౌలిక సదుపాయాలు కల్పించాం. ప్రత్యేక హోదా ఇచ్చాం. ప్రత్యేక పారిశ్రామిక విధానం తీసుకొచ్చాం. మీకు మేం ఇచ్చేవాళ్లమే తప్ప తీసుకునే వాళ్లం కాదు. మళ్లీ ప్రత్యేక హోదా తీసుకొస్తాం. మీతో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక బంధం ఉంది. అందరం కలిసి భారత దేశాభివృద్ధికి పాటుపడదాం. పౌరసత్వ సవరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సహకరించదు. ఈశాన్య రాష్ట్రాలకు ఆ దెబ్బ తగలనీయం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు.