తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోవా: భాజపాలో చేరిన 10 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు - భాజపా

గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రకాంత్​ కవ్లేకర్​ నేతృత్వలో 10 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు చీలిక వర్గంగా ఏర్పడి భాజపాలో చేరారు. ఈ మేరకు స్పీకర్​ రాజేశ్​ పట్నేకర్​కు లేఖ అందజేశారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేల చేరికతో 40 సీట్ల శాసనసభలో భాజపా బలం 27కు చేరుకుంది.

గోవా: భాజపాలో చేరిన 10 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

By

Published : Jul 10, 2019, 11:01 PM IST

Updated : Jul 10, 2019, 11:14 PM IST

కర్ణాటకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితి గోవాకు పాకింది. గోవాలో కాంగ్రెస్‌కున్న 15 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలు చీలిక వర్గంగా ఏర్పడి భాజపాలో చేరారు. ప్రస్తుతం 40 సీట్లున్న గోవా శాసనసభలో భాజపా బలం 27కు చేరుకుంది.

2017లో గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలు మిగిలారు.

ఫిరాయింపుల నిరోదక చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు రెండింటిలో మూడొంతుల మంది తమ పార్టీలో చేరినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ ప్రకటించారు. భాజపా బలం 27కు పెరిగిందని తెలిపారు.

10 మంది ఎమ్మెల్యేలను భాజపాలో కలుపుతున్నట్లు స్పీకర్​ రాజేశ్​ పట్నేకర్​కు లేఖ అందజేశారు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు. అనంతరం లేఖను అందుకున్నట్లు స్పీకర్​ ప్రకటించారు.

తాజా పరిణామాలతో 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో భాజపాకు 27, కాంగ్రెస్‌కు 5, గోవా ఫార్వర్డ్‌ పార్టీకి ము‌గ్గురు, ఎన్సీపీ, ఎమ్​జీపీకి తలా ఒకరు సభ్యులుండగా ముగ్గురు స్వతంత్ర సభ్యులున్నారు.

ఇదీ చూడండి: కర్​నాటకం: గవర్నర్ ఎలా చెప్తే అలానే- భాజపా

Last Updated : Jul 10, 2019, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details