మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈవీఎంలలో అవకతవకలు జరిగాయన్న ఊహాగానాలపై స్పందించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల కమిషనే జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. అవకతవకలు జరిగాయన్న ఊహాగానాలకు తెరదించి, సంస్థ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ఈసీదేనని స్పష్టం చేశారు.
ఈవీఎంల భద్రత బాధ్యత ఈసీదే: ప్రణబ్
ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయన్న ఊహాగానాలపై ఆందోళన వ్యక్తం చేశారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల కమిషనే జవాబుదారీగా వ్యవహరించాలని స్పష్టం చేశారు ప్రణబ్.
ప్రణబ్ ముఖర్జీ ప్రకటన
ప్రజాతీర్పు అవకతవకలకు లోనైందన్న ఆరోపణల పట్ల ఆందోళన చెందుతున్నానని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు ప్రణబ్. "ఈవీఎంల భద్రత, ఎన్నికల కమిషన్ బాధ్యత. ప్రజాస్వామ్యానికి మూలమైన ఎన్నికలపై ఎలాంటి ఊహాగానాలకు ఆస్కారం ఉండటానికి వీల్లేదు. ప్రజాతీర్పే అంతిమం" అని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : గేమ్ ఆఫ్ థ్రోన్స్, బీబర్తో ప్రకృతికి ముప్పు!