తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కర్ణాటక,గోవా పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు చేటు'

కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఆర్థిక వ్యవస్థ పతనానికి దారి తీస్తుందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం హెచ్చరించారు. రాజ్యసభలో ప్రసంగించిన ఆయన భాజపా తీరుపై విమర్శలు చేశారు.

చిదంబరం

By

Published : Jul 11, 2019, 3:34 PM IST

దేశంలో రాజకీయ అస్థిరత తలెత్తితే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పి.చిదంబరం హెచ్చరించారు. రాజ్యసభలో బడ్జెట్​పై మాట్లాడిన ఆయన.. కర్ణాటక, గోవాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విరుచుకుపడ్డారు.

చిదంబరం

"కర్ణాటక, గోవాలో మనం చూస్తున్నది రాజకీయ సంక్షోభమే కావచ్చు. కానీ ఇది ఆర్థిక వ్యవస్థ పతనానికి దారి తీస్తుంది. విదేశీ పెట్టుబడిదారులు, రేటింగ్ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు వినే అంశాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రాజకీయ అస్థిరత, పరిణామాలను బట్టి ఈ ప్రభావం ఉంటుంది. ఈ విషయాన్ని అధికార పార్టీ దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్లు రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి. రెండు రోజులుగా జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశాయి. ఇలాగే జరిగితే రాజకీయ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది."

-చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి

చిదంబరం విమర్శలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్​ తిప్పికొట్టారు. కాంగ్రెస్​కు అధ్యక్షుడు లేకపోతే అందుకు భాజపా కారణం ఎందుకు అవుతుందని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: రైతులు ఘోషిస్తున్నారు.. పట్టించుకోండి: రాహుల్

ABOUT THE AUTHOR

...view details