తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సొంతరాష్ట్రాల్లోనే వలసకూలీలకు ఉపాధి!

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి తమ స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్రం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసిందని సమాచారం. వలస కూలీలకు సొంతరాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లాల జాబితాను సిద్ధం చేసి.. వారికి ఏ పని కల్పించాలనే అంశమై ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

migrant
వలసకూలీల కోసం కేంద్రం సమగ్ర ప్రణాళిక

By

Published : Jun 9, 2020, 7:32 AM IST

లాక్‌డౌన్‌ అమలులో భాగంగా ఉపాధి కోల్పోయి తమ స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా వలస కూలీలకు వారి సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా వలస కూలీలు అధికంగా ఉన్న 116 జిల్లాల జాబితాను సిద్ధం చేసి వారికి ఎలాంటి పనులు కల్పించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌ ద్వారా వారికి ఉపాధి కల్పించనున్నారు. జన్‌ ధన్‌ యోజన, కిసాన్‌ కళ్యాణ్ యోజన, ఆహార భద్రతా చట్టం, పీఎం ఆవాస్‌ యోజన పథకాలను కూడా ఇందుకు ఉపయోగించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం అన్ని మంత్రిత్వశాఖల నుంచి నివేదికలు సేకరించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:సైనిక రహస్యాలను పాక్​కు చేరవేస్తున్న ఇద్దరి అరెస్ట్​!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details