ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో డిజిటల్ విద్యను అందించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. రూ.15 వేలు విలువ చేసే సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందివ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ. 60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇందులో కేంద్రం వాటాగా రూ. 36,473 కోట్లుగా పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాలి. దీని ద్వారా 4 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం తెలిపింది.
విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్న కేంద్రం! - free laptops for students
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో డిజిటల్ విద్యను అందించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది కేంద్రం. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇచ్చే యోచనలో ఉంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ. 60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది.
విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్న కేంద్రం!
ప్రసుతం దేశ వ్యాప్తంగా 3.75 కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో చేరారని పేర్కొంది. ఇందులో 2021-22 విద్యా సంవత్సరంలో 1.5 కోట్ల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ప్రణాళిక రూపొందిస్తోంది.
ఇదీ చూడండి: డ్రాగన్ తోకకు కత్తెర.. చైనా సంస్థల టెండర్లు రద్దు!