తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదంపై చర్చకు 'బ్రిక్స్' పచ్చజెండా - రష్యా

ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా ఈ ఏడాది 'బ్రిక్స్'​ సదస్సులో చర్చలు జరగనున్నాయి. బ్రెజిల్​లో జరిగిన ఐదు దేశాల ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఉగ్రవాదంపై చర్చకు 'బ్రిక్స్' పచ్చజెండా

By

Published : Mar 16, 2019, 5:17 PM IST

బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాద నిర్మూలన అంశంపై చర్చ జరపాలని నిర్ణయించాయి సభ్య దేశాలు. బ్రెజిల్​లోని కురితిబాలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు బ్రిక్స్​ దేశాల ప్రతినిధులు.

ఈ సమావేశంలో భారత్​ తరఫున విదేశీ వ్యవహారాల కార్యదర్శి టీఎస్ త్రిమూర్తి హాజరయ్యారు.

బ్రిక్స్​లో బ్రెజిల్​, రష్యా, భారత్​, చైనా, దక్షిణ అమెరికా సభ్య దేశాలు. సభ్య దేశాలకు బ్రెజిల్​ సారథ్యం వహిస్తోంది.

" ఉగ్రవాద నిర్మూలనను బ్రిక్స్ సదస్సులో చర్చించబోయే ప్రధాన అంశంగా చేర్చాలని బ్రెజిల్​ ప్రతిపాదించింది. దీనికి భారత్​ పూర్తి మద్దతు తెలిపింది. సభ్య దేశాలన్నీ ఉగ్రవాదంపై కఠిన చర్యలకు పరస్పర సహకారం అందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. "
-భారత విదేశీ వ్యవహారాల శాఖ

ఈ అంశంతో పాటు శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, సంప్రదాయ ఔషధరంగాల్లో సభ్య దేశాల పరస్పర సహకారంపై చర్చ జరుగుతుందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details