దేశంలోనే అత్యంత పొడవైన నోట్ పుస్తకాన్ని సర్దార్ పేరిట రూపొందించారు ఆ యువకులు. ఈ నోట్‌బుక్‌లోని ముఖచిత్రంపై సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలువెత్తు మూర్తిని చిత్రించారు. సర్దార్ పటేల్ జీవిత విశేషాల్ని సైతం ముద్రించారు. అహ్మదాబాద్‌లోని నవనీత్ ఎడ్యూకేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని రూపొందించారు .
దేశంలోనే అత్యంత పొడవైన 'ఐక్యతా' నోట్‌బుక్
సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో దేశంలోనే అత్యంత పొడవైన నోట్ పుస్తకాన్ని తయారుచేశారు అహ్మదాబాద్ యువకులు. నవనీత్ ఎడ్యూకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఐక్యతా మూర్తి చిత్రంతో సహా ఆయన జీవిత విశేషాల్ని ఇందులో ముద్రించారు.
దేశంలోనే అత్యంత పొడవైన 'ఐక్యతా' నోట్‌బుక్
"మేం 'యువ యునైట్ ఇండియా' అనే కార్యక్రమంతో ముందుకు వచ్చాం. నవనీత్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ ద్వారా భారత్‌లోనే అత్యంత పొడవైన నోట్‌బుక్‌ను తయారుచేశాం. ఇది మీటరు పొడవుంటుంది. ఈ నోట్‌బుక్‌లో ఐక్యతపై సందేశాన్ని ముద్రించాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రాన్ని పొందుపరిచాం. దీనినే ఐక్యతా విగ్రహంగా పిలుస్తున్నారు. ఈ విగ్రహం నుంచే ప్రేరణ పొందాం." - నవనీత్ ఫౌండేషన్ ప్రతినిధి