తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా 'మహా' హామీ- ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు!

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదుల చేసింది భాజపా. రైతులకు 12 గంటలు ఉచిత విద్యుత్​, ఐదేళ్లలో కోటి ఉద్యోగాల కల్పన వంటి హామీలను ప్రణాళికలో పొందుపరిచింది.

By

Published : Oct 15, 2019, 4:20 PM IST

భాజపా మేనిఫెస్టో విడుదల

ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూ.. మహారాష్ట్రలో అధికార భాజపా మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, భాజపా కార్యనిర్వహక అధ్యక్షుడు జె.పి.నడ్డా ముంబయిలో ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించారు.

మహాత్మా పూలే, సావిత్రిబాయ్ పూలే, వీర్‌ సావర్కర్‌లకు భారతరత్న పురస్కారాలు ప్రదానం చేయాలని ఎన్నికల ప్రణాళికలో ప్రతిపాదించింది భాజపా. రైతులకు 12 గంటలకు పైగా విద్యుత్తును అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.

భాజపా మేనిఫెస్టోలోని హామీలు

  • వ్యవసాయంలో సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు కృషి.
  • రాబోయే ఐదేళ్లలో కోటి ఉద్యోగాల సృష్టి.
  • కోటి కుటుంబాలను మహిళా పొదుపు సంఘాలతో అనుసంధానించి ప్రత్యేక ఉపాధి అవకాశాల కల్పన.
  • 2022 నాటికి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు
  • మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు
  • మహారాష్ట్రలోని అన్ని రహదారుల శాశ్వత మరమ్మతు, నిర్వహణ కోసం స్వతంత్ర యంత్రాంగాల రూపకల్పన.
  • కృష్ణ, కోయ్నా సహా ఇతర నదులలో ప్రవహించే అదనపు నీటిని పశ్చిమ మహారాష్ట్రలోని కరవు ప్రాంతానికి తరలింపు.

288 శాసనసభ స్థానాలున్న మహారాష్ట్రలో ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు వెలువడతాయి.

ఇదీ చూడండి: భారత్​కు ఫిదా- యునెస్కో నాలుగు అవార్డులు

ABOUT THE AUTHOR

...view details