కరోనా వైరస్ ధాటికి ప్రజలంతా బెంబేలెత్తి పోతున్నారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ కోసం వైద్య నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కరోనాకు ఎవరూ భయపడవద్దని చెబుతున్నారు రాజస్థాన్ టోంక్ సవాయి మధోంపుర్ ఎంపీ సుఖ్బీర్ సింగ్. తన వద్ద ప్రకృతి సిద్ధమైన వైద్యం ఉందని తెలిపారు. బురదలో కూర్చొని శంఖాన్ని పూరిస్తే కరోనా వైరస్ పరార్ అవుతుందని చెప్పారు. దీని కోసం ఓ వీడియోను విడుదల చేశారు.
'బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా పరార్'
కరోనా మహమ్మారికి సహజసిద్ధమైన వైద్యముందని చెప్పారు రాజస్థాన్ భాజపా ఎంపీ సుఖ్బీర్ సింగ్. బురదలో కూర్చొని శంఖం ఊదితే వ్యాధి నయం అవుతుందని తెలిపారు. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెప్పారు.
'బురదలో కూర్చొని శంఖం ఊదితే కరోనా పరార్'
ఇలా చేస్తే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందాన్నారు సుఖ్బీర్ సింగ్.