దేశ రాజధానిలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దిల్లీలోని ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది బైక్ ట్యాక్సీ యాప్ రాపిడో. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు మూడు కిలోమీటర్ల వరకు ఉచిత రైడ్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
" దిల్లీ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాపిడో సంస్థ తన వంతు సాయం చేస్తోంది. అందులో భాగంగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారందరికీ ఉచిత రవాణా కల్పించాలని నిర్ణయించింది. దిల్లీలోని ఏ ప్రాంతంలోనైనా మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను 100శాతం పూర్తి ఉచితంగా చేరవేస్తాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో ఎన్నికలు ఎంతో కీలకం. అందుకే సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం."