తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అధికారమిస్తే.. 10లక్షల ఉద్యోగాలు: ఆర్జేడీ

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి అధికారమిస్తే రాష్ట్రంలో పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని పార్టీ నేత తేజస్వీ యాదవ్​ తెలిపారు. ఎన్నికల్లో గెలిచాక.. తొలి మంత్రిమండలి సమావేశంలోనే ఈ ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు తేజస్వీ.

RJD has promised to give 10 lakh govt jobs when the party bounds in power
అధికారమిస్తే.. 10లక్షల ఉద్యోగాలు

By

Published : Sep 28, 2020, 8:02 AM IST

వచ్చే నెలలో జరగబోయే బిహార్​ శాసనసభ ఎన్నికల్లో తమకు అధికారం కట్టబెడితే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వాగ్దానం చేశారు.

"ఇది నీటిపై మాటల్లాంటి వాగ్దానం కాదు. మా దృఢ సంకల్పంతో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. మేం ప్రకటించిన ఉద్యోగ నియామకానికి.. అధికారం చేపట్టిన తర్వాత నిర్వహించే తొలి కేబినెట్​ సమావేశంలోనే అనుమతులు జారీ చేస్తాం. ఈ అంశం గురించి ఇప్పటికే ఆర్థిక వేత్తలతో సంప్రదింపులు జరిపాం. ఇది సాధించగలిగే లక్ష్యమే. త్వరలో దీనికి సంబంధించిన కార్యచరణ నమూనాతో ప్రజల ముందుకు వస్తాం." అనితేజస్వీ స్పష్టం చేశారు.

'ప్రతిపక్షాలతోనే కలిసి'

బిహార్​ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్షాలతోనే కలిసి నడుస్తామని లోక్​ తాంత్రిక్​ జనతాదళ్​(ఎల్​జేడీ) వ్యవస్థాపకుడు శరద్​ యాదవ్​ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జేడీయూతో చేతులు కలుపుతామని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. బిహార్​ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల్లో జరగబోయే మధ్యంతర ఎన్నికలలో లౌకిక శక్తులను ఒకే తాటిపైకి తీసుకురావడానికి గట్టిగా కృషి చేస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసన గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు శరద్​.

జేడీయూ అధ్యక్షుడిగా అశోక్​ చౌధురి

జేడీయూ బిహార్​ అధ్యక్షుడిగా రాష్ట్ర భవన నిర్మాణ శాఖ మంత్రి అశోక్​ చౌధురి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ ప్రకటించారు. అంతకముందు ఆ పదవిలో ఉన్న వశిష్ఠ నారాయణ్​ సింగ్​ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దిల్లీలో చికిత్స పొందుతున్న కారణంగా.. అశోక్​ చౌధురిని నియమించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

సీట్ల సర్దుబాటులో గందరగోళం

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారైన నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ పోటీ చేసే స్థానాలపై సమాలోచనలు ప్రారంభించాయి. అయితే.. ఎన్​డీఏ, మహాకూటమిలలో సర్దుబాటులో గందర గోళం నెలకొంది. మహాకూటమిలోని చాలా పార్టీలు ఆర్జేడీపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ ఛైర్మన్​ అవినాష్​ పాండే ఇటీవల బిహార్​లో పర్యటించారు. అయితే.. మహాకూటమిలో కాంగ్రెస్​కు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కేటాయించకపోతే.. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి పార్టీ సిద్ధంగా ఉందని అవినాష్​ స్పష్టం చేశారు. మరోవైపు మహాకూటమి నుంచి 'హామ్​' పార్టీ జాతీయ అధ్యక్షుడు జితన్​ రాం మాంఝీ వైదొలగి ఎన్​డీఏలో చేరారు. ఉపేంద్ర కుశ్వాహ కూడా మహాకూటమి నుంచి బయటకు వెళ్లాలని యోచిస్తున్నారు.

ఇదీ చదవండి:

బిహార్​ ఫైట్​: ఎన్నికల నగారా మోగిందోచ్​..

బిహార్​ ఎన్నికల ఫైట్​​: ఎవరి సత్తా ఎంత..?

కరోనా పడగ నీడలో ఎన్నికలు... సాధ్యమేనా?

ABOUT THE AUTHOR

...view details