కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే మాటకి ఉదాహరణగా నిలిచాడు మైసూర్‌కు చెందిన పునీత్ కుమార్. స్కూల్లో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పని చేసే ఇతను 60సెకన్లలో భగత్‌సింగ్ చిత్రాన్ని గీసాడు. అనంతరం స్నేహితుల సూచనతో చిత్రపటం గీస్తున్నప్పుడు చిత్రించిన వీడియోని 'వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఇండియా' వెబ్సైట్లో పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత వెబ్సైట్ ప్రతినిధులు అధికారికంగా రికార్డ్‌ని ప్రకటించారు.
"ఈ రికార్డ్ పట్ల చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు నా ప్రతిభని అందరికి చూపించలేకపోయా, కానీ నా స్నేహితులు, సామాజిక మాధ్యమాల వలన ఇది సాధ్యమైంది. నా కష్ట ఫలితంగానే ఇక్కడ ఉన్నాను. చిత్రాన్ని గీయటానికి రోజూ సాధన చేసే వాడిని మొదట్లో 130సెకన్ల సమయం పట్టేది. కొన్నాళ్లకి 90 సెకన్లు, కానీ సాధన చేసి 60సెకన్లలో పూర్తి చేయగలిగాను. గీస్తున్నప్పుడు చిత్రించిన వీడియోని 'వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఇండియా' వెబ్సైట్లో పెట్టాను. కొన్ని రోజుల నిరీక్షణ తర్వాత వెబ్సైట్ ప్రతినిధులు అధికారికంగా రికార్డ్‌ని ప్రకటించారు"