తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆన్​లైన్​లో మొబైల్​ బదులు రాళ్లు- భాజపా ఎంపీ షాక్​

అంతర్జాలంలో కొన్న వస్తువులకు బదులు పండ్లు, రాళ్లు రావటం వంటి మోసాలు తరచూ చూస్తునే ఉంటాం. ఈ మోసాలకు సామాన్య ప్రజలు గురవుతుంటారు. ఈసారి ఓ భాజపా ఎంపీకీ ఈ తిప్పలు తప్పలేదు. ఎవరు ఆ ఎంపీ.. అసలేం జరిగింది?

మొబైల్​ బదులు రాళ్లు-భాజపా ఎంపీ షాక్​

By

Published : Oct 29, 2019, 6:21 PM IST

Updated : Oct 29, 2019, 8:19 PM IST

ప్రస్తుత యువత అంతర్జాలంలోనే చరవాణిలను కొనడానికి ఇష్టపడుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం కొన్న వస్తువులకు బదులు రాళ్లు, ఇనుప వస్తువులు, పండ్లు రావటం వంటి మోసాలు జరుగుతుంటాయి. ఈ మోసాలకు సామాన్య ప్రజలే కాదు.. బంగాల్​కు చెందిన ఓ భాజపా ఎంపీ కూడా బలయ్యారు. తాను ఆర్డర్​ ఇచ్చిన మొబైల్​కు బదులుగా రాళ్లు రావటాన్ని గుర్తించి ఆశ్చర్యానికి గురైన ఆ ఎంపీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

మొబైల్​ బదులు రాళ్లు

అసలేం జరిగింది...

బంగాల్​లోని మాల్డా ఉత్తర ప్రాంతానికి చెందిన భాజపా ఎంపీ ఖాగెన్ ముర్ము కుమారుడు అనిమెస్​ ముర్ము.. ప్రముఖ ఆన్​లైన్​ సంస్థలో ఈ నెల 23న శాంసంగ్​ మొబైల్​ను బుక్​ చేశారు. ఈ చరవాణి ధర రూ. 11,999.

కొన్న మొబైల్​ బిల్లు

శాంసంగ్​ మొబైల్​ ఆర్డర్​ ఇస్తే... షియోమీ బాక్స్​ వచ్చిందని... అందులోనూ చరవాణికి బదులు రెండు రాళ్లు ఉండటం చూసి ఆశ్చర్య పోయినట్టు తెలిపారు ముర్ము. మోసం జరిగిందని గుర్తించిన ఆయన.. వెంటనే స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి:ఆపరేషన్​ 'సాగర్'​: బాగ్దాదీకీ లాడెన్​ గతే..!

Last Updated : Oct 29, 2019, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details