తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టిక్​టాక్​ సహా ఆ యాప్​లు సర్కార్​పై కేసు వేయొచ్చు'

చైనా యాప్​ టిక్​టాక్​.. తమపై విధించిన బ్యాన్​ను ఖండించింది. ప్రభుత్వ నిర్ణయంపై కేసు దాఖలు చేసే యోచనలో ఉంది. అయితే, టిక్​టాక్​ మాత్రమే కాదు.. బ్యాన్​ చేసిన అన్ని యాప్​లూ ప్రభుత్వాన్ని కోర్టులో ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం కల్పిస్తోందంటున్నారు ప్రముఖ న్యాయవాదులు

'Banned Chinese apps can challenge government order in court'
'టిక్​టాక్​ సహా.. ఆ యాప్​లు భారత్​పై కేసు వేయొచ్చు!'

By

Published : Jun 30, 2020, 5:53 PM IST

ప్రభుత్వం ఇటీవల బ్యాన్ చేసిన 59 చైనా యాప్​లు.. సర్కార్​ నిర్ణయాన్ని ఖండిస్తూ.. ఏ భారత కోర్టులోనైనా ప్రశ్నించే హక్కుందంటున్నారు సుప్రీం కోర్టు న్యాయవాదులు.

జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంగా.. జూన్​ 29న 59 చైనా యాప్​లను రద్దు చేసింది కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ. దీంతో.. బ్యాన్​ జాబితాలో ఒకటైన 'టిక్‌టాక్' ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్యాన్​కు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసేందుకు ప్రభుత్వంతో చర్చించనున్నట్లు స్పష్టం చేసింది.

బ్యాన్​ న్యాయమేనా..?

సుప్రీం కోర్టు న్యాయవాదులు ఆదిత్యా పరోలియా, మీనాక్షి అరోరాల ప్రకారం... జాతీయ భద్రతకు భంగం కల్పించేలా ఉంటే.. సందేహం లేకుండా యాప్​లు బ్యాన్​ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఉదాహరణకు.. ప్రజా విధానాలకు వ్యతిరేకంగా, అక్రమంగా, ప్రభుత్వ ఆంక్షలను కాలరాస్తూ చలామణి అవుతున్న పోర్న్​ వెబ్​సైట్లను నిరభ్యంతరంగా బ్యాన్​ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది. అంటే, సరైన కారణం ఉంటే ప్రభుత్వం విధించే ఏ బ్యాన్ అయినా న్యాయపరమైందే అవుతుంది.

బ్యాన్​ చేస్తే.. ఏం చేయగలరు?

సరైన కారణం లేకుండా బ్యాన్ విధించినట్లు సదరు యాప్​ యజమానులు భావిస్తే.. వారు నిస్సందేహంగా హైకోర్ట్​, సుప్రీం కోర్టుల్లో బ్యాన్​ను వ్యతిరేకిస్తూ పిటిషన్​ దాఖలు చేయొచ్చు. ఒకవేళ యాప్​లో ఎలాంటి అభ్యంతరాలు లేనట్లు రుజువైతే.. ప్రభుత్వం జారీ చేసిన రద్దు ఉత్తర్వులు చెల్లవన్నారు అరోరా.

  • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21ల ప్రకారం విదేశీ పౌరులు సహా ప్రతి ఒక్కరూ భారత న్యాయస్థానాలను ఆశ్రయించి, న్యాయం కోసం పోరాడే హక్కుంది.
  • బ్యాన్​ చేసిన చైనా కంపెనీల్లో పనిచేస్తున్న భారత ఉద్యోగులు సైతం.. కోర్టులో పిటిషన్​ దాఖలు చేసే అవకాశముంది. సరైన కారణాలు లేకుండా బ్యాన్​ చేస్తే.. వారిని నిరుద్యోగులు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని సదరు ఉద్యోగులు పోరాడొచ్చు.
  • అయితే, బ్యాన్​ వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి.. ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం చట్టపరంగా ప్రభుత్వానికి లేదు.

ఇదీ చదవండి:'చెప్పేవి 'స్వదేశీ' మాటలు.. దింపేవి చైనా వస్తువులు'

ABOUT THE AUTHOR

...view details