తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్యకు ఉగ్రదాడుల ముప్పు...?

అయోధ్యకు ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందని అనుమానాలు వ్యక్తమమవుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది.

అయోధ్యకు ఉగ్రముప్పు...?

By

Published : Jun 16, 2019, 5:43 AM IST

Updated : Jun 16, 2019, 8:19 AM IST

అయోధ్యకు ఉగ్రముప్పు...?

ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న అనుమానాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్​లోని అయోధ్యలో హైఅలెర్ట్ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా రామజన్మ భూమి ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

అయోధ్య నగరంలోకి ప్రవేశించడానికి ఉన్న నాలుగు ప్రధాన రహదారుల్లో చెక్​పోస్టులు ఏర్పాటుచేసి ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నగరంలోకి ప్రవేశించే బస్సులు, రైళ్లలోనూ తనిఖీలు చేపడుతున్నారు. హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇదీ విషయం

2005 జూన్ 5న అయోధ్యలో జరిగిన ఉగ్రదాడి సందర్భంగా భద్రతా దళాలు ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. జమ్ముకశ్మీర్​కు చెందిన నలుగురు అనుమానితులను అరెస్టు చేశాయి. ఈ కేసుపై తీర్పు ఈ నెల 18న వెలువడనుంది. ఈ నేపథ్యంలో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి.

ఇదీ చూడండి: '2024 నాటికి రూ.350 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం'

Last Updated : Jun 16, 2019, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details