మహారాష్ట్రలోని అధికార భాజపా ప్రభుత్వ తీరుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. రత్నగిరిలోని ఆనకట్ట పీతల వల్లే కూలిపోయిందని నీటి సంరక్షణ మంత్రి ప్రకటించడాన్ని తప్పుపట్టింది. పీతలు తప్పు చేస్తే వాటినే అరెస్టు చేయాలంటూ వినూత్నంగా నిరసన చేపట్టింది.
ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర కొన్ని పీతలు తీసుకుని నౌపాడ పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఆనకట్ట కూలడానికి కారణమైన పీతలను అరెస్టు చేయాలంటూ నిరసన చేపట్టారు.
"భాజపా ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రవర్తిస్తోంది. ఆనకట్ట కూలడానికి కారణమైన గుత్తేదారును రక్షించడానికి నీటి సంరక్షణశాఖ మంత్రి సావంత్ ప్రయత్నిస్తున్నారు. ఆనకట్ట కూలడానికి పీతలే కారణమని అంటున్నారు. అలా అయితే ఆ పీతలనే అరెస్టు చేయండి." - జితేంద్ర, ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి.