ప్రజాస్వామ్యంలో నిరసనలు చేపట్టడం ప్రజల హక్కు. సాధారణంగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారకుండా ఉండటానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని స్థానిక యంత్రాంగం ముందస్తు జాగ్రత్తగా.. కొంతమంది నుంచి పూచీకత్తులు సేకరించడానికి సిద్ధపడింది.
పూచీకత్తు ఎందుకు?
కాన్పుర్‌లోని మహ్మద్ అలీ పార్క్.. సీఏఏ-ఎన్ఆర్సీ నిరసనలకు కేంద్రబిందువుగా మారింది. ఈ ఆందోళనల్లో మహిళలే అధికంగా ఉండటం విశేషం. అయితే నిరసనల్లో ఎలాంటి హింస జరగకుండా స్థానిక యంత్రాంగం వింత చర్యలు చేపట్టింది. రూ. 2లక్షల బాండు మీద పూచీకత్తు సంతకాలు పెట్టాలని 66మందిని కోరింది.
మహిళలను పురుషులు ప్రేరేపించవచ్చు!
అయితే నిరసనలతో తమకు సంబంధం ఉనట్టు వీరు అంగీకరించలేదు. కానీ తమ కుటుంబంలోని అనేక మంది మహిళలు ఆందోళనల్లో పాల్గొంటున్నట్టు వీరిలో చాలా మంది ఒప్పుకున్నారు.
నిరసనల్లో పాల్గొనే విధంగా మహిళలను పురుషులు ప్రేరేపించే అవకాశం ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టుఅదనపునగర మేజిస్ట్రేట్ అనిల్ అగ్నిహోత్రి తెలిపారు.
"ఛామన్గంజ్ పోలీసు పరిధిలోని మహ్మద్ అలీ పార్క్ వద్ద ఆందోళనలతో సంబంధం ఉన్నవారికి... సీఆర్పీసీ సెక్షన్ 107,116 కింద నోటీసు జారీ చేశాం. పురుషుల ప్రేరణతో మహిళలు ఆందోళనల్లో పాల్గొనే అవకాశముంది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ చర్యలు చేపట్టాం." - అనిల్ అగ్నిహోత్రి, అదనపు నగర మేజిస్ట్రేట్
ఇదీ చూడండి:సీఏఏ వ్యతిరేక తీర్మానాలపై 'ఈయూ'లో చర్చ.. మార్చిలో ఓటింగ్