బంగాల్ ఎన్నికలకు ముందు అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి షాక్ తగిలింది. అక్కడి ఎంఐఎం కీలక నేత అన్వర్ పాషా సహా ఆయన అనుచరులు చాలా మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓట్లను చీల్చి.. భాజపాకు సాయం చేసేందుకే ఎంఐఎం పనిచేస్తుందని విమర్శించారు. కొందరు మతం పేరుతో దేశంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'బిహార్లో మహాకూటమి ఓటమికి ఓవైసీనే కారణం'
''ఎంఐఎం.. ఓట్లను చీల్చి భాజపాకు సాయం చేస్తోంది. ఇది బిహార్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు లాభించింది. బంగాల్లో మాత్రం ఇది సాధ్యం కాదు.''
- అన్వర్ పాషా