పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో కీలక సమావేశాలు జరగనున్నాయి. జనవరి 30న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా, 31న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తన నివాసంలో అన్ని పార్టీల నేతలతో భేటీ కానున్నారు. జనవరి 30న ఉదయం.. ప్రభుత్వం కూడా అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది.
ఎలాంటి అంతరాయాలు లేకుండా బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలన్న ఉద్దేశంతో ఈ భేటీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గత రెండు సెషన్స్లోనూ రాజ్యసభ 100 శాతం ఉత్పాదకత సాధించిన నేపథ్యంలో.. ఇదే రీతిన బడ్జెట్ సమావేశాలూ కొనసాగాలని వెంకయ్య నాయుడు నేతలకు సూచించనున్నారు.