తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో కాంగ్రెస్​తో పొత్తు లేదు: ఆమ్​ఆద్మీ

దిల్లీలో కాంగ్రెస్​-ఆమ్​ఆద్మీ పొత్తు చర్చలకు దాదాపు తెరపడింది. హస్తం పార్టీతో కలిసేది లేదని ఆప్​ స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో  కలిసేందుకు కాంగ్రెస్​ సుముఖంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

దిల్లీలో కాంగ్రెస్​తో పొత్తు లేదు: ఆమ్​ఆద్మీ

By

Published : Apr 20, 2019, 3:02 PM IST

దిల్లీలో కాంగ్రెస్​తో పొత్తు లేదు: ఆమ్​ఆద్మీ

దిల్లీలో కాంగ్రెస్​ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేసింది ఆమ్​ఆద్మీ. దిల్లీలో తప్ప ఇతర రాష్ట్రాల్లో పొత్తు కుదరదన్న కాంగ్రెస్​ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దిల్లీలో కాంగ్రెస్​కు మూడు స్థానాలు అప్పగిస్తే... అవి భాజపాకు ఇచ్చినట్టేనని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్​ సిసోడియా అన్నారు.

హరియాణా పొత్తులపై..

హరియాణాలో సీట్ల పంపకాలపై సిసోడియా స్పందించారు. తొలుత కాంగ్రెస్​ ఆరు సీట్లు తీసుకుని, జన్​నాయక్​ జనతా పార్టీ(జేజేపీ)కి మూడు, ఆప్​కు ఒక సీటు ఇవ్వడానికి ప్రతిపాదించిందన్నారు.

అనంతరం మాట మార్చీ జేజేపీకి రెండు సీట్లే కేటాయించడానికి హస్తం పార్టీ ప్రతిపాదించినట్టు ఆప్​ సీనియర్​ నేత సంజయ్​ సింగ్​ తెలిపారు. ​ ప్రతిపాదనకు అంగీకరించినప్పటికీ కాంగ్రెస్​ మళ్లీ మాట మార్చడాన్ని తప్పుబట్టారు.

దిల్లీ మినహా ఏ రాష్ట్రంలోనూ పొత్తు కుదరదని కాంగ్రెస్​ పార్టీ శుక్రవారం తేల్చిచెప్పింది.

ఇదీ చూడండి:న్యాయవ్యవస్థను బలహీన పరిచే కుట్ర: సీజేఐ

ABOUT THE AUTHOR

...view details