దిల్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 62 సీట్లతో మెజారిటీ పార్టీగా అవతరించిన ఆమ్ఆద్మీ శాసనసభాపక్ష సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఎన్నికైన ఆప్ శాసనసభ్యులు సమావేశం కానున్నారని పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ వెల్లడించారు. 11.30 గంటల సమయంలో ఆమ్ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక పూర్తవుతుందని తెలిపారు.
అదేసమయంలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఫిబ్రవరి 14 లేదా 16 తేదీల్లో జరిగే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు పేర్కొంటున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రాంలీలా మైదానాన్ని పరిశీలిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో మైదానం ఎంపికపై తుది నిర్ణయానికి రాలేదని వెల్లడిస్తున్నారు.