ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిని అదుపుచేసేందుకు బెంగళూరు పోలీసులు వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నారు. అచ్చం పోలీసు రూపంలో ఉండే మైనపు బొమ్మలను పలు జంక్షన్ల వద్ద ఉంచుతున్నారు. తద్వారా ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, బస్సులు, లారీ డ్రైవర్లు.. సిగ్నల్స్ దాటడం, అతివేగంగా వెళ్లడం వంటి రోడ్డు నిబంధనలను అతిక్రమించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని పోలీసులు భావిస్తున్నారు.
ఈ బొమ్మ పోలీసుతో జాగ్రత్త.. అతిక్రమించారో పట్టేస్తుంది! ఈ బొమ్మ పోలీసుతో జాగ్రత్త.. అతిక్రమించారో పట్టేస్తుంది! " పోలీసులను కొద్ది దూరం నుంచి చూసిన తర్వాత.. వాహనదారులు హెల్మెట్‌తో పాటు సీటు బెల్టు పెట్టుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసును గమనించి.. వాహనాన్ని నడిపే సమయంలో మొబైల్ ఫోన్లు వాడటం కూడా ఆపేస్తుండటం గమనించిన తర్వాతే.. ఈ బొమ్మ పోలీసులను పెట్టాము. గత రెండు రోజుల్లో బెంగళూరులో ఆరు చోట్ల ఈ బొమ్మ పోలీసులను ఏర్పాటు చేశాం. ఇది సఫలమైతే మరో 174 చోట్ల పెడతాం.
- బీఆర్ రవికాంతే గౌడ, బెంగళూరు అదనపు ట్రాఫిక్ కమిషనర్
బొమ్మే అనుకుంటే.. అంతే!
అయితే ఇవి బొమ్మ పోలీసులని వాహనదారులు గుర్తించిన తర్వాత రోడ్డు నిబంధనలు అతిక్రమించే వారు యథావిధిగా వెళ్తారు కదా? అని అనుకుంటున్నారేమో... ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అలా రోడ్డు నిబంధనలు అతిక్రమించే వారిని పట్టుకునేందుకు సరికొత్త ఆలోచనతో వచ్చారు రవికాంతే. ఒకటి, రెండు రోజుల తర్వాత అదే మైనపు బొమ్మ స్థానంలో నిజమైన పోలీసును పెడతామని.. తద్వారా కెమెరాతో ఫొటోలు తీసి రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారికి పక్కా ఆధారాలతో జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ విధానంపై ఓ ఉన్నతస్థాయి ఐపీఎస్ అధికారి విభేదించారు. ఈ పద్ధతి వల్ల పోలీసుశాఖకు అనవర ఖర్చు పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ బొమ్మ పోలీసుతో జాగ్రత్త.. అతిక్రమించారో జరిమానానే! ఈ బొమ్మ పోలీసుతో జాగ్రత్త.. అతిక్రమించారో జరిమానానే! ఇదీ చూడండి:'శ్రీలంకకూ చైనా భయం- దిల్లీ వైఖరే కీలకం'