తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం.. దేహశుద్ధి..! - ఉత్తర్​ప్రదేశ్​

దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా బాలికలపై అఘాయిత్యాలు ఆగటం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాతంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. చాక్లెట్ల ఆశ చూపి పదేళ్ల  బాలికపై ఆత్యాచారం చేయబోయాడు ఓ 70 ఏళ్ల వృద్ధుడు. ఈ అమానుష ఘటన ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలోని నిఠారి గ్రామంలో జరిగింది. గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని చితకబాదారు.

పదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం

By

Published : Sep 28, 2019, 10:32 PM IST

Updated : Oct 2, 2019, 9:47 AM IST

పదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం
ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలోని నిఠారి గ్రామంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. డబ్బులు, చాక్లెట్లు ఆశ చూపి ఓ పదేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు 70 ఏళ్ల వృద్ధుడు. స్థానికులు గమనించి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. మహిళలు, యువకులు.. వృద్ధుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

యూపీ హర్దోయ్​ నగరానికి చెందిన శంభుదయాల్​ అనే వృద్ధుడు నిఠారి గ్రామంలో బొగ్గు వ్యాపారం చేస్తూ చిన్న దుకాణం నడుపుతున్నాడు. బాధితురాలి తల్లిదండ్రులు ఇళ్ల నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. రోజూలాగే తల్లిదండ్రులు కూలీకి వెళ్లిన తర్వాత మధ్యాహ్నం ఎవరూ లేని సమయం చూసి ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారికి డబ్బులు, చాక్లెట్లు ఆశ చూపి దుకాణంలోకి తీసుకెళ్లాడు వృద్ధుడు. ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు వృద్ధుడిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అయినప్పటికీ తాను ఎలాంటి తప్పు చేయలేదని బుకాయించేందుకు ప్రయత్నించాడు. మహిళలు వృద్ధుడికి దేహుశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

వృద్ధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు పంపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: 'దివాలా'తో సొంతగూటికి థామస్​కుక్​ కస్టమర్లు!

Last Updated : Oct 2, 2019, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details