ప్రాణాంతక కరోనా బారిన పడిన వృద్ధులు కోలుకుంటున్నారు. ఇటీవల కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో వందేళ్ల వృద్ధులు కోలుకోగా.. తాజాగా మహారాష్ట్ర ఠాణె జిల్లాకు చెందిన 106 ఏళ్ల బామ్మ కొవిడ్‌ను జయించింది. ఆమె కేవలం 10 రోజుల వ్యవధిలోనే కోలుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు వైద్యులు. ప్రస్తుతం బామ్మ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
కరోనాను జయించిన 106 ఏళ్ల బామ్మ
మహమ్మారి కరోనా నుంచి మరో వృద్ధురాలు కోలుకుంది. మహారాష్ట్రకు చెందిన 106 ఏళ్ల బామ్మ... ఆసుపత్రిలో 10 రోజుల చికిత్స అనంతరం కొవిడ్ నుంచి బయటపడింది.
కరోనాను జయించిన 106ఏళ్ల బామ్మ
పెద్ద వయసు కావడం వల్ల కరోనా సోకిన ప్రాథమిక దశలో బామ్మను ఆసుపత్రిలో చేర్చలేదని ఆమె బంధువుల్లో ఒకరు చెప్పారు. అయితే 10 రోజుల క్రితం బామ్మను ఆసుపత్రిలో చేర్చగా... వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి, చికిత్స అందించడం వల్లే త్వరగా కోలుకున్నారని తెలిపారు.
ఇదీ చూడండి:ఫేస్‌బుక్‌కు మళ్లీ నోటీసులు.. విచారణకు రావాల్సిందే!