స్మార్ట్ఫోన్లలో యూట్యూబ్ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్ఫోన్లలో యూట్యూబ్ వాడకం 85 శాతానికి పెరిగిందని ప్రకటించింది ఆ సంస్థ. గతేడాది ఇది 73 శాతంగా ఉండేది.
కారణాలివే..
2016 సెప్టెంబర్‌లో జియో రాకతో దేశంలో డేటా ఛార్జీలు బాగా తగ్గాయి. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడానికి ఇదీ ఓ కారణమైంది. ఈ ప్రభావంతో యూట్యూబ్ వీడియోలు చూసేందుకు భారత్‌లోని మొబైల్ వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మొబైల్లో వినియోగం 85 శాతానికి పెరిగిందని యూట్యూబ్ సంస్థ తెలిపింది. వీడియోల వీక్షణ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. 40 శాతం వాటా మెట్రో నగరాలది. 60 శాతం మిగతా ప్రాంతాలది. యూట్యూబ్‌లో విద్యకు సంబంధించిన కేటగిరీలు వేగంగా పురోగతి సాధిస్తున్నాయని సంస్థ తెలిపింది. 2020 నాటికి దేశంలో 50 కోట్లకు పెరగనున్నారు అంతర్జాల వినియోగదారులు.
నెలవారీగా యూట్యూబ్‌ను తరచుగా వినియోగిస్తున్న వారి సంఖ్య గతేడాది సుమారు 22 కోట్లు ఉండగా, ఈ ఏడాది అది దాదాపు 26 కోట్లకు చేరింది.