తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాలుగు నెలల్లో 61 మంది భద్రతా సిబ్బంది మృతి

నాలుగు నెలల్లో జమ్ముకశ్మీర్​లో 61 మంది భద్రతా సిబ్బంది, 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు హోం శాఖ కార్యాలయం వెల్లడించింది. మొత్తం 177 ఉగ్రవాద ఘటనల్లో 142 మంది గాయపడినట్లు ఓ సామాజిక ఉద్యమకారుడు ఆర్​టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపింది.

నాలుగు నెలల్లో 61 మంది భద్రతా సిబ్బంది మృతి

By

Published : May 28, 2019, 7:27 AM IST

ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో జమ్ముకశ్మీర్​లో మొత్తం 177 ఉగ్రవాద ఘటనల్లో 61 మంది భద్రతా సిబ్బంది, 11 మంది పౌరులు మరణించారని కేంద్ర హోంశాఖ కార్యాలయం తెలిపింది. ఈ ఘటనల్లో 142 మంది గాయపడ్డారు. వారిలో 73 మంది భద్రతా సిబ్బందే ఉన్నారు.

ఆర్​టీఐ ద్వారా సామాజిక ఉద్యమకారుడు రోహిత్ చౌదరి అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వివరాలను వెల్లడించింది హోంశాఖ కార్యాలయం.

ఈ నాలుగు నెలల్లో జమ్ముకశ్మీర్​లో మొత్తం 86 మంది ఉగ్రవాదులను హతమైనట్లు జనరల్​ ఆఫీసర్ కమాండర్​ ఇన్ చీఫ్ రణ్​బీర్ సింగ్ ఇదివరకే తెలిపారు. 20 మంది ముష్కరులను నిర్బంధించినట్లు చెప్పారు.

జమ్ముకశ్మీర్​లో 450మంది తీవ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్, పీఓకేల్లో16 ఉగ్ర శిబిరాలు ఉన్నాయని వెల్లడించారు.

ఇదీ చూడండి: 'దేశాన్ని మొదటగా విభజించాలన్నది సావర్కరే'

ABOUT THE AUTHOR

...view details