తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు బస్సులు ఢీ- ఆరుగురు మృతి - up lucknow hardoi road accident

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. 12మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.

Uttar Pradesh bus accident
రెండు బస్సులు ఢీకోని ఘేర ప్రమాదం

By

Published : Aug 26, 2020, 12:37 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో లఖ్​నవూ-హర్దోయీ రహదారిపై ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 12 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదంలో రెండు బస్సులు నుజ్జునుజ్జు అయ్యాయి.

ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్న బస్సు

ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు యూపీ రోడ్డురవాణా అధికారులు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. 24 గంటల్లోగా నివేదిక అందజేయాలని నిర్దేశించారు.

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన బస్సు
ఘటనా స్థలం వద్ద పరిస్థితి

ఈ రెండు బస్సులు అతివేగంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ఇదీ చూడండి: మోదీ షేర్‌ చేసిన అద్భుత దృశ్యం చూశారా?

ABOUT THE AUTHOR

...view details