తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దావత్ నుంచి బైక్​లపై తిరిగెళ్తూ నలుగురు మృతి

కర్ణాటకలోని టీ నరసిపూర్​- మైసూరు రహదారిపై లారీ, రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.  స్నేహితుడి ఇంటి నుంచి బైక్​లపై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నలుగురు మృతి చెందారు.

దావత్ నుంచి బైక్​లపై తిరిగెళ్తూ నలుగురు మృతి

By

Published : Jul 24, 2019, 11:52 AM IST

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీ నరసిపూర్​- మైసూరు రహదారి వద్ద ఓ లారీని రెండు ద్విచక్రవాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఆ ధాటికి ఘటనాస్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలించాక చికిత్స పొందుతూ మరణించారు.

లారీ మైసూరు నుంచి వస్తున్నట్టు సమాచారం. మృతులను రాఘవేంద్ర, మధు కుమార్​, మధు, అహమద్​ ఖాన్​గా గుర్తించారు. వీరందరూ మైసూరులోని ఓ హోటల్​లో పని చేసేవారు. టీ నరసిపూర్​లోని స్నేహితుడి ఇంటి వద్ద దావత్​ చేసుకుని మైసూరుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ఇదీ చూడండి:- 'శౌచాలయంలో చిన్నారులకు వంట చేస్తే తప్పేంటి?'

ABOUT THE AUTHOR

...view details