తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడు ఆలయాల్లో ఉగ్ర కుట్ర భగ్నం

ముగ్గురు అనుమానిత ఇస్లామిక్​ స్టేట్​ సానుభూతిపరులు తమిళనాడు కోయంబత్తూరులోని ఆలయాలు, చర్చిల్లో ఉగ్రదాడులకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు వెల్లడించారు. వారిని అరెస్ట్​ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

తమిళనాడు ఆలయాల్లో ఉగ్ర కుట్ర భగ్నం

By

Published : Jun 20, 2019, 6:45 AM IST

Updated : Jun 20, 2019, 8:25 AM IST

తమిళనాడులోని కోయంబత్తూర్​ పట్టణంలో ఉగ్రదాడి ప్రయత్నాలను భగ్నం చేశారు పోలీసులు. ముగ్గురు అనుమానిత ఇస్లామిక్​ స్టేట్​ సానుభూతిపరులను అరెస్ట్ చేశారు.

షాజహాన్​, మహ్మద్​​ హుస్సేన్​, షేక్​​ సఫియుల్లాహ్​ అనే ముగ్గురు యువకులపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. ఎఫ్​ఐఆర్​ ప్రకారం రద్దీగా ఉండే ఆలయాలు, చర్చిల వద్ద ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

ఇస్లామిక్​ స్టేట్​కు సంబంధించిన వీడియోలను తరుచుగా చూస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు వారిపై నిఘా పెట్టారు పోలీసులు. చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం కింద ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవలే కోయంబత్తూర్​లోని 7 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) తనిఖీలు నిర్వహించింది. తమిళనాడులో ఇస్లామిక్​ స్టేట్​కు విభాగానికి సూత్రధారిగా అనుమానిస్తున్న మహ్మద్​​ అజారుద్దీన్​ను అరెస్ట్​ చేసింది. శ్రీలంకలో బాంబు దాడులకు సూత్రధారి అయిన జహ్రాన్​ హషీమ్​కు ఫేస్​బుక్​లో స్నేహితుడిగా ఉన్నాడు అజారుద్దీన్​.

ఇదీ చూడండి:చెన్నైలో నీళ్లు కావాలంటే టోకెన్​ తీసుకోవాల్సిందే!

Last Updated : Jun 20, 2019, 8:25 AM IST

ABOUT THE AUTHOR

...view details