తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిర్భయ' దోషులకు ఉరి ఖాయం- సుప్రీం కీలక నిర్ణయం

After attending the opposition parties meeting on CAA in New Delhi, Jharkhand CM Hemant Soren expressed his concern about the unrest prevails across the country which according to Soren is not good. About the implementation of CAA in Jharkhand, Soren said that they will first asses the whole thing and then discuss about it.

Supreme Court dismisses curative petitions of two convicts
'నిర్భయ' దోషులకు ఉరి ఖాయం- సుప్రీం కీలక నిర్ణయం

By

Published : Jan 14, 2020, 2:14 PM IST

Updated : Jan 14, 2020, 2:40 PM IST

14:13 January 14

'నిర్భయ' దోషులకు ఉరి ఖాయం- సుప్రీం కీలక నిర్ణయం

నిర్భయ అత్యాచార కేసులో నలుగురు దోషులకు మరణశిక్ష అమలు ఖాయమైంది. దోషులు వినయ్​ శర్మ, ముకేశ్​ దాఖలు చేసిన క్యురేటివ్​ పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ వ్యాజ్యానికి ఎలాంటి విచారణ అర్హత లేదని స్పష్టంచేసింది. నలుగురికి ఉరిశిక్ష విధించాల్సిందేనని తేల్చిచెప్పింది.

దిల్లీ కోర్టు ఇటీవల జారీచేసిన డెత్​ వారెంట్​ మేరకు... నిర్భయ కేసు దోషులను ఈనెల 22న ఉదయం 7 గంటలకు తిహార్​ జైలులో ఉరి తీయనున్నారు. ఇందుకోసం జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఇదీ కేసు...

2012 డిసెంబరు 16 రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో కదిలే బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడం వల్ల మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి రాంసింగ్ తిహార్​​ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దోషులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని 2019 జులై 9న కొట్టివేసింది. ఉరి శిక్ష అమలుకు వీలుగా ఈనెల 7న దిల్లీ పటియాలా హౌస్​ కోర్టు డెత్​ వారెంట్ జారీ చేసింది.

మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు 'క్యురేటివ్​ పిటిషన్​' దోషులకు ఉన్న ఆఖరి అవకాశం. అయితే క్యురేటివ్​ పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో నలుగురు కిరాతకులకు ఉరి అనివార్యమైంది.

Last Updated : Jan 14, 2020, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details