తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నందిగ్రామ్​లో సువేందు నామినేషన్​ దాఖలు

బంగాల్​ శాసన సభ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్న సువేందు అధికారి నామినేషన్​ దాఖలు చేశారు. ఇటీవలే తృణమూల్​ను వీడి భాజపాలో చేరిన సువేందు స్థానిక నేత కాగా.. సీఎం మమతా బెనర్జీ సైతం పోటీకి ఈ నియోజకవర్గాన్నే ఎంచుకోవడం గమనార్హం.

Before filing nomination, Suvendu Adhikari offers puja at Janakinath Temple
నందిగ్రామ్​ అభ్యర్థిగా సువేందు నామినేషన్​ దాఖలు

By

Published : Mar 12, 2021, 1:18 PM IST

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీ చేయనున్న సువేందు అధికారి నందిగ్రామ్​ భాజపా అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్​ దాఖలు చేశారు. ఎన్నికలకు ముందు తృణమూల్​ను వీడి భాజపాలో చేరిన సువేందు.. నామినేషన్​ సందర్భంగా భారీ బలప్రదర్శన చేశారు.

నందిగ్రామ్​ అభ్యర్థిగా సువేందు నామినేషన్​ దాఖలు

నామినేషన్​ అనంతరం తృణమూల్​ కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సువేందు. తృణమూల్ కాంగ్రెస్​ ప్రైవేటు కంపెనీగా మారిందని ఆరోపించారు. టీఎంసీలో కేవలం దీదీ, ఆమె అల్లుడు మాత్రమే స్వేచ్ఛగా మాట్లడగలరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని.. అభివృద్ధి జరగాలంటే మమత​ను ఓడించాల్సిందేనని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రజల దీవెనలు నాతోనే ఉన్నాయని నమ్ముతున్నా. ఈ ఎన్నికల్లో ప్రజలు భాజపాకు మద్దతుగా నిలిచి.. బంగాల్​కి నిజమైన అభివృద్ధిని ఆహ్వానిస్తారు. మాకు ఎవరు పోటీ అన్నదానిపై అసలు ప్రశ్నే లేదు.

-సువేందు అధికారి, భాజపా నేత

2019 లోక్​సభ ఎన్నికల్లో 18పార్లమెంటరీ స్థానాల్లో భాజపా గెలుపొందిందని.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సువేందు జోస్యం చెప్పారు.

నామినేషన్​కు ముందు సభలో మాట్లాడుతోన్న సువేందు అధికారి..
దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజల్లో సువేందు..
నందిగ్రామ్​లో నిర్వహించిన హోమంలో పాల్గొన్న సువేందు

అంతకముందు నందిగ్రామ్​లో పార్టీ కార్యకర్తలతో సమావేశం సందర్భంగా సీఎం మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించారు. దీదీకి పార్టీ కార్యకర్తలు ఐదేళ్లకొకసారి మాత్రమే గుర్తొస్తారని.. కానీ వారితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని సువేందు చెప్పారు. తమ బంధం చాలా పాతదని తెలిపారు. మమతను తన అభిమానులే ఓడిస్తారన్నారు. తాను నందిగ్రామ్​ ఓటరు అని సువేందు పునరుద్ఘాటించారు.

నామినేషన్​కు ముందు నందిగ్రామ్​ పార్టీ కార్యకర్తలతో సమావేశం..

ABOUT THE AUTHOR

...view details