తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Bank Seized Vehicles Auction : తక్కువ ధరకే.. సెకండ్ హ్యాండ్​ కార్లు.. ఇలా ఇంటికి తెచ్చుకోండి!

Second Hand Cars at Low Price : సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడానికి చూస్తున్నారా..? అయితే.. స్పెషల్​ గా మీకోసమే ప్రజెంట్​ చేస్తున్న ఆర్టికల్ ఇది. మార్కెట్ రేటు కన్నా.. తక్కువ ధరకే మంచి కారు ఎలా పొందాలో తెలుసుకోండి.

Second Hand Cars at Low Price
Bank Seized Vehicles Auction

By

Published : Aug 18, 2023, 12:54 PM IST

Bank Seized Vehicles Auction in Online : సొంత ఇల్లు అనే కోరిక నెరవేరిన తర్వాత.. ప్రతి మనిషికి ఉండే స్వప్నం కారు. మెజారిటీ జనం కారును స్టేటస్ సింబల్​ గా భావిస్తుంటారు. అలాంటి క్లబ్​లో తామూ చేరిపోవాలని దాదాపుగా అందరూ కోరుకుంటారు. కానీ.. డబ్బు సమస్యలు అడ్డుగా ఉంటాయి. మరికొందరు కారు కొనే స్థోమతకు దగ్గరగా ఉంటారు కానీ.. కొత్తకారు కొనుగోలు చేసేంత సొమ్ము లేక వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి సెకండ్ హ్యాండ్ కారు మంచి ఆప్షన్​గా చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.

సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడం వల్ల.. కొత్తకారుతో పోలిస్తే చాలా డబ్బు ఆదా అవుతుంది. అయితే.. సెకండ్ హ్యాండ్ అన్నంత మాత్రాన పాతది కొనాల్సిన అవసరం లేదని, మంచి కండీషన్​లో ఉన్న కారును కొనుగోలు చేసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఇందుకోసం చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.

How to Participate PNB E-Auction 2023 : అతి తక్కువ ధరకు ఇల్లు కావాలా..? బ్యాంకు వేలం వేస్తోంది..!

సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే వెబ్​ సైట్లు :

Second Hand Car Selling Websites : కార్లు మాత్రమే కాదు.. ద్విచక్రవాహనాలు కూడా సెకండ్ హ్యాండ్​లో తీసుకునే అవకాశం ఉంది. ఇక, డబ్బులు సర్దుబాటు కానివారికి బ్యాంకులు లోన్ అందించే ఛాన్సు కూడా ఉంది. ఇదంతా మనం ఎక్కడికో వెళ్లి.. వ్యయప్రయాసలకు ఓర్చి చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఆన్​లైన్​లో ఈ పని ఈజీగా పూర్తి చేసేయొచ్చు. మరి, ఈ సేవలు అందించే వైబ్​ సైట్లు ఏమున్నాయో తెలుసుకోండి.

  • OLX
  • CarDekho
  • Quikr
  • CarWale
  • CarTrade
  • Truebil
  • cartoq
  • Cars24
  • CarCollection
  • Car Bazaar

పై వెబ్​సైట్లలో.. సెకండ్ హ్యాండ్ కార్లు అందుబాటులో ఉంటాయి. ఇన్ని సైట్లలో బోలెడు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అందువల్ల.. బడ్జెట్​తోపాటు కండీషన్​ డీటెయిల్స్​ కూడా శోధించి మరీ నచ్చిన కారును సొంతం చేసుకోవచ్చు.

Govt Bank FD Interest Rates 2023 : ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేస్తున్నారా?.. అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!

కార్లను బ్యాంకులు వేలం వేస్తున్నాయి :

ఇవేకాకుండా.. బ్యాంకులు కూడా వేలంలో కార్లను విక్రయిస్తుంటాయి. రుణాలు చెల్లించని కారణంగా వాహనాలను సీజ్ చేస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. ఇలాంటి కార్లను బ్యాంకింగ్ సంస్థలు స్వయంగా వేలం వేస్తుంటాయి. ఈ వేలం ప్రక్రియలో పాల్గొనడం ద్వారా.. తక్కువ ధరకే కార్లను సొంతం చేసుకోవచ్చు. అలాంటి బ్యాంకుల వివరాలు కింద చూడండి.

  • National Housing Bank (NHB) Residex
  • Union Bank of India (UBI) Auction
  • Reserve Bank of India (RBI) Auction
  • State Bank of India (SBI) Auction
  • Bank of Baroda (BOB) Auction

పైన పేర్కొన్న వెబ్ సైట్లతోపాటు, బ్యాంకు వేలం ప్రక్రియలో పాల్గొని కార్లు కొనుగోలు చేయడం ద్వారా.. మరికొన్ని బెనిఫిట్లు ఉన్నాయి. వెబ్​సైట్లు పక్కాగా వారంటీ, ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తాయి. దీనివల్ల కారు కొనుగోలు చేసే వ్యక్తికి మాగ్జిమమ్ సమస్య రాదు.

బ్యాంకు వేలంలో కారు కొన్నవారికి కూడా దాదాపుగా సమస్యలు రావు. మార్కెట్ రేటుకన్నా తక్కువ ధరకే కారు లభించడంతోపాటు.. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలూ సక్రమంగా కొత్త యజమానికి అందుతాయి. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. సో.. మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనాలంటే.. ఇవి మంచి ఆప్షన్స్ అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.

Prathidwani : కోట్లపేటను తలపించిన కోకాపేట భూముల వేలం.. ఎందాకా ఈ జోరు?

ఈ స్పైడర్​మ్యాన్​ కామిక్​ పేజ్​ ధర రూ.24 కోట్లు!

ABOUT THE AUTHOR

...view details