Election Commission: ఎన్నికల ర్యాలీలపై శనివారం కీలక సమావేశం నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. యూపీ సహా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో భౌతిక ప్రచార ర్యాలీలు, రోడ్షోలపై జనవరి 15 వరకు అమల్లో ఉన్న నిషేధాన్ని పొడిగించాలా వద్దా అనే అంశంపై చర్చించనుంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వీటిపై జనవరి 8న నిషేధం విధించింది ఈసీ. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి శనివారం ఓ నిర్ణయం తీసుకోనుంది.
ఎన్నికల ర్యాలీలపై నేడు ఈసీ కీలక భేటీ - ఎన్నికల ప్రచారం
Election Commission: ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం ర్యాలీలు, రోడ్షోలపై నిషేధం కొనసాగుతోంది. ఈ నిషేధం కొనసాగింపుపై శనివారం కీలక నిర్ణయం తీసుకోనుంది భారత ఎన్నికల సంఘం.
election commission
ఒమిక్రాన్ ప్రభావంతో ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లోని జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలకు కేటాయించిన బ్రాడ్కాస్ట్ సమయాన్ని రెట్టింపు చేయాలని భావిస్తున్నట్లు శుక్రవారం ఈసీ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపుర్లో ఫిబ్రవరి 10 నుంచి 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి:'యూపీలో భాజపాకు మూడు లేదా నాలుగు సీట్లే!'