Ayodhya Tent City :2024 జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం (Ayodhya Temple Opening), రాముడి విగ్రహ ప్రతిష్ఠమహోత్సవం ఉన్న నేపథ్యంలో ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిరథమహారథుల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారితో పాటు సాధారణ భక్తులకూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. భక్తుల బస, అన్నపానీయాలకు సంబంధించిన ఏర్పాట్లపై రామ జన్మభూమి ట్రస్ట్.. జిల్లా యంత్రాంగంతో చర్చలు జరిపింది. అందులో భాగంగా దాదాపు 25 వేల మంది భక్తుల కోసం టెంట్ సిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.
Ayodhya Ram Mandir Opening Ceremony : అయోధ్య రాయాలయ ప్రారంభోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో వారు ఆయోధ్య వాసుల ఇళ్లలో, హోటళ్లలో పెయింగ్ గెస్ట్‌గా బస చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ధర్మశాలలు, ప్రైవేటు హోటళ్ల సామర్థ్యానికి మించి భక్తులు వస్తారని అంచనా. అలాంటి వారికి సహాయం చేసేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సిద్ధమైంది. అయోధ్యలోని కరసేవక్‌పురం కాంప్లెక్స్, రామసేవక్పురం కాంప్లెక్స్ సహా నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో టెంట్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.