తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్భంతో ఉన్న ఫారెస్ట్ గార్డ్​పై మాజీ సర్పంచ్ దాడి - మహారాష్ట్రలో మహిళా ఫారెస్ట్ గార్డ్​పై దాడి

Attack On Pregnant Forest Guard: గర్భంతో ఉన్న అటవీ శాఖ ఉద్యోగిపై గ్రామ మాజీ సర్పంచ్​, అతని భార్య కలిసి దాడి చేశారు. మహారాష్ట్ర సతారా జిల్లాలోని పల్సవాడే గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Forest Guard Beaten up
మహిళ ఫారెస్ట్ గార్డ్​

By

Published : Jan 20, 2022, 2:02 PM IST

Updated : Jan 20, 2022, 4:11 PM IST

Attack On Pregnant Forest Guard: మహారాష్ట్ర సతారా జిల్లాలో దారుణం జరిగింది. గర్భంతో ఉన్న అటవీ శాఖ అధికారిపై గ్రామ మాజీ సర్పంచ్,​ అతని భార్య కలిసి దాడి చేశారు. జిల్లాలోని పల్సవాడే గ్రామంలో ఈ ఘటన జరిగింది.

గర్భంతో ఉన్న ఫారెస్ట్ గార్డ్​పై మాజీ సర్పంచ్ దాడి

నిందితుడు స్థానికంగా అటవీ నిర్వహణ కమిటీలో సభ్యుడు. గతంలో గ్రామ సర్పంచ్​గా కూడా పనిచేశాడు. అయితే.. తన అనుమతి లేకుండా ఒప్పంద ఉద్యోగులను వెంట తీసుకెళ్లారనే కోపంతో అటవీ శాఖ మహిళా గార్డ్​పై కోపోద్రిక్తుడయ్యాడు. ఆమె గర్భంతో ఉందని చూడకుండా తన భార్యతో కలిసి దాడి చేశారు.

ప్రస్తుతం మహిళా ఫారెస్ట్ గార్డ్ మూడు నెలల గర్భవతి.

మహిళ ఫారెస్ట్ గార్డ్​పై దాడి

దీనిపై స్పందించిన మహారాష్ట్ర వాతావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే.. నిందితులకు కఠిన శిక్ష తప్పదని ట్వీట్ చేశారు. ఉద్యోగులపై దాడులు సహించబోమని స్పష్టం చేశారు. బాధితురాలు గర్భానికి ప్రమాదం జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఫారెస్ట్ గార్డ్​ అయిన తన భర్తపై కూడా దాడి చేశారని ఆ మహిళా ఉద్యోగి ఆరోపించారు.

ఇదీ చదవండి:ఖతర్నాక్ దొంగ.. చుట్టూ జనం ఉన్నా జేబులోని మొబైల్​ మాయం!

: సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 20, 2022, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details