తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లికి వెళ్లాడని ఆ వ్యక్తి అరెస్ట్​.. చరిత్రలో మొదటిసారి! - అసోం బాల్య వివాహాల లేటెస్ట్ న్యూస్​

వివాహానికి హాజరయ్యాడనే కారణంతో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బాల్య వివాహాలను నివారించే చర్యల్లో భాగంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అసోం పోలీసులు తెలిపారు.

man attending minor wedding
అసోం పోలీసుల అణిచివేత

By

Published : Feb 10, 2023, 4:27 PM IST

బాల్యవివాహాలను అరికట్టేందుకు అసోం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అణిచివేత చర్యలు చేపడుతోంది. బాల్య వివాహానికి హాజరయ్యాడనే కారణంతో బొంగైగావ్​ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లికి వెళ్లినందుకు సాక్షిగా ఆరోపిస్తూ ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే అసోం పోలీసులు బాల్య వివాహాలకు సంబంధించిన కేసుల్లో ఇప్పటివరకు 2,666 మందిని అరెస్ట్​ చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్మ శర్మ కూడా ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరుతూ ట్వీట్​ చేశారు.

"బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మా అణిచివేత కొనసాగుతోంది. ఇప్పటివరకు 2,666 మందిని అరెస్ట్ చేశాం. ఈ దురాచారానికి వ్యతిరేకంగా మా డ్రైవ్​ కొనసాగిస్తాం. దీనికోసం అసోం ప్రజల మద్దతు కోరుతున్నాం."
-- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి​

బొంగైగావ్​ జిల్లాలోని సుపరిగురి ప్రాంతానికి చెందిన జహీర్​ అలీ మండల్ అనే వ్యక్తి.. తన మేనల్లుడు పెళ్లికి వెళ్లాడనే కారణంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మండల్​ను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అసోం ప్రభుత్వం బాల్య వివాహాల బాధితులకు ఆర్థికంగా అండగా ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకోసం ముగ్గురు రాష్ట్ర మంత్రులతో కూడిన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో దాదాపు 31 శాతం వివాహాలు తక్కువ వయసులోనే జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details