అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బారువా ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల జీతం ఇచ్చేముందు ప్రభుత్వ ఉద్యోగులందరి వ్యాక్సినేషన్ స్టేటస్‌ను చూడాలని వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులను ఆదేశించారు జిష్ణు. ఇలా చేయడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు.
టీకా తీసుకోవడం అనేది స్వచ్ఛందంగా జరగాలని, ఒకరు బలవంతం చేయరాదని గతంలో సుప్రీం కోర్టు, దిల్లీ, కేరళ హైకోర్టులు తీర్పు వెలువరించాయి. ఈ నేపథ్యంలో.. టీకా తీసుకున్నవారికే నెలజీతం ఇవ్వాలని ఆదేశించిన చీఫ్ సెక్రటరీపై విమర్శలు వెల్లువెత్తాయి.
"టీకా విషయంలో ప్రధాన కార్యదర్శి ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారు? ఇది గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుంది."