First wife sets House on Fire: భర్త రెండో వివాహం పట్ల ఆగ్రహంగా ఉన్న ఓ మహిళ ఏకంగా ఇంటికే తగలబెట్టింది. ఈ ఘటనలో కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లోని ధర్భంగా జిల్లాలో శనివారం ఈ దారుణం జరిగింది.
ఇదీ జరిగింది: సుపౌల్ బాజార్‌కు చెందిన 40 ఏళ్ల ఖుర్షీద్ ఆలం.. పదేళ్ల క్రితం బీబీ పర్వీన్‌ను (35) వివాహం చేసుకున్నాడు. వారికి పిల్లలు లేరు. పిల్లల కోసం రెండేళ్ల కిందట సమీప గ్రామానికి చెందిన రోష్మి ఖతూన్‌ను పెళ్లి చేసుకున్నాడు ఖుర్షీద్. అయితే ఈ వివాహం పట్ల మొదటి భార్య పర్వీన్ సంతృప్తిగా లేదు. తీవ్ర పరిణామాలుంటాయని భర్తను తరచూ బెదిరిస్తూ ఉండేది.