AP CM Jagan Illegal Assets Case Postponed in High Court:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి.. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఆస్తుల అటాచ్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా న్యాయస్థానం పలు కీలక అంశాలపై విచారణ జరిపింది. అందులో మొదటగా.. వాన్‌పిక్ కేసులో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరుల ఆస్తుల అటాచ్ ఉత్తర్వులను సవరిస్తూ.. అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అప్పీళ్ల విచారణ జరిగింది. అనంతరం ఈడీతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీలు వేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో వాన్‌పిక్ కేసులో ఆస్తి జప్తుపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, నవంబరు 6న సుప్రీంకోర్టులో ఇదే కేసుపై విచారణ ఉందని తెలంగాణ హైకోర్టుకు న్యాయవాదులు తెలిపారు. దీంతో వాన్‌పిక్ కేసులో ఆస్తుల జప్తుపై విచారణను హైకోర్టు డిసెంబరు 11కు వాయిదా వేస్తూ.. ఉత్తర్వులు వెలువరించింది.
Investigation in TS High Court on ED Attache Assets: ఏపీ సీఎంజగన్ అక్రమాస్తుల కేసుల్లోని వాన్‌పిక్ ఛార్జిషీట్లో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. విచారణలో న్యాయవాదుల వాదోపవాదాలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణను డిసెంబరు 11కి వాయిదా వేసింది. ఇదే కేసులో నవంబరు 6న సుప్రీంకోర్టులో విచారణ ఉందని న్యాయవాదులు తెలపడంతో హైకోర్టు వాయిదా వేసింది.
Jagan Illegal Assets Case: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం.. డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు
High Court Hearing on Vanpick Case Petitions:వాన్‌పిక్ కేసులో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు అల్ఫా అవెన్యూస్, ఆల్ఫా విల్లాస్, జీటూ కార్పొరేట్, సుగుణి కనస్ట్రక్షన్స్, గిల్‌క్సిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్, తదితర కంపెనీల ఆస్తులను 2014లో ఈడీ అటాచ్ చేసింది. వాటిలో కొన్ని ఆస్తులను విడుదల చేసేలా ఈడీ అటాచ్ మెట్ ఉత్తర్వులను సవరిస్తూ.. అప్పీలేట్ ట్రైబ్యునల్ 2019లో ఆదేశించింది. అప్పీలేట్ ట్రైబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఈడీతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్, పలు కంపెనీలు వేసిన 15 పిటిషన్లపై ఇవాళ జస్టిస్ శ్యాంకోషి, జస్టిస్ ఎ.లక్ష్మినారాయణ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో వాన్‌పిక్ కేసులో సుమారు 12 వేల ఎకరాలను జప్తు నుంచి విడుదల చేయడంపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై నవంబరు 6న విచారణకు రానున్నందున.. డిసెంబరు 11కి కేసును హైకోర్టు వాయిదా వేసింది. ఈలోగా సుప్రీంకోర్టులో తేలితే మెన్షన్ చేయాలని న్యాయవాదులకు హైకోర్టు సూచించింది.
Hearing on Harirama Jogaiah Petition: మరోవైపు జగన్‌పై సీబీఐ, ఈడీ కేసుల విచారణ వెంటనే చేపట్టేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని కోరుతూ.. హరిరామ జోగయ్య ఇటీవల దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి..తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులను అసెంబ్లీ ఎన్నికల్లోగా తేల్చాలన్న పిటిషన్‌ను సవరించి.. మరిన్ని వివరాలతో మళ్లీ దాఖలు చేయాలని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్యకు హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.