తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేప్​ కేసు నిందితుడు రెండు దశాబ్దాలకు అరెస్ట్

రెండు దశాబ్దాల క్రితం దేశంలో సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు ఒడిశా పోలీసులు. 1999లో అప్పటి ఒడిశా సీఎం రాజీనామాకు దారితీసిన ఈ కేసులో కీలక నిందితుడైన బిబేకానంద బిశ్వాల్​ అలియాస్​ బిబాన్​.. మహారాష్ట్రలో పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు.

Anjana Mishra Gang-Rape Case: Prime Accused On The Run For 22 Years Nabbed From Maharashtra
ఒడిశా సంచలన రేప్ కేసులో 20ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్టు

By

Published : Feb 22, 2021, 4:05 PM IST

1999లో అప్పటి ఒడిశా సీఎం జేబీ పట్నాయక్​ రాజీనామాకు దారితీసిన సంచలన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు రెండు దశాబ్దాల తర్వాత అరెస్ట్​ చేశారు. ఓ ఐఎఫ్​ఎస్​ అధికారి భార్యతో సంబంధమున్న ఈ కేసులో కీలక నిందితుడైన బిబేకానంద బిశ్వాల్​ అలియాస్​ బిబాన్​.. మహారాష్ట్ర లోనావాలా ప్రాంతంలో పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న బిబాన్​.. జలంధర్​ స్వైన్​ పేరుతో నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి లోనావాలాలో ప్లంబర్​గా పని చేస్తున్నాడని తెలిపారు. నిందితుడి అరెస్ట్​ చేయడానికి.. మూడునెలల క్రితం 'ఆపరేషన్​ సైలెంట్​ వైపర్​'ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

ఏం జరిగింది?

1999 జనవరి 9న అర్ధరాత్రి సమయంలో ఓ మహిళా జర్నలిస్ట్​ స్నేహితుడితో కలిసి కారులో భువనేశ్వర్​ నుంచి కటక్​కు వెళ్తుండగా.. బరంగా సమీపంలో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును సీబీఐకి అప్పగించింది ఒడిశా హైకోర్టు.

తనపై అత్యాచారం జరిగిందని వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు.. నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్​ చేసింది.

దోషులకు జీవిత ఖైదు

ఒడిశాలో తీవ్ర దుమారం రేపిన ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు(పాడియా అలియాస్​ ప్రదీప్​ సాహు, ధీరేంద్ర, బిబాన్) నిందితులుగా ఉన్నారు. వీరిలో తొలుత పాడియా, ధీరేంద్రను పోలీసులు అరెస్ట్​ చేయగా.. ఖుర్దా జిల్లా సెషన్స్​ కోర్టు వారిని దోషులుగా తేల్చి, జీవిత ఖైదు విధించింది. వారు హైకోర్టులో అప్పీలు చేసుకోగా.. ఈ తీర్పును సమర్థించింది. అయితే పాడియా గతేడాది ఫిబ్రవరి 24న క్యాపిటల్​ ఆస్పత్రిలో మృతిచెందినట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:మద్యం తాగించి యువతిపై గ్యాంగ్ రేప్​

ABOUT THE AUTHOR

...view details