తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' గవర్నర్​ను కలవనున్న సంకీర్ణ కూటమి నేతలు

మహారాష్ట్రలో అధికార శివసేన- ఎన్​సీపీ- కాంగ్రెస్ కూటమి బృందం గురువారం.. గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీని కల​వనుంది. 'తమ ప్రభుత్వంపై భాజపా తప్పుడు ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను వివరించనున్నట్లు' తెలిపారు కాంగ్రెస్​ నేత నానా పటోలే.

By

Published : Mar 25, 2021, 5:35 AM IST

నేడు మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీని.. అధికార సంకీర్ణ కూటమి నేతలు కలవనున్నారు. భాజపా తప్పుడు ఆరోపణల నేపథ్యంలో.. శివసేన- ఎన్​సీపీ- కాంగ్రెస్ నేతలు కోశ్యారీకి వాస్తవాలను వివరించనున్నట్లు తెలిపారు కాంగ్రెస్​ సీనియర్​ నేత నానా పటోలే.

ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే.. తమ బృందానికి నేతృత్వం వహించనున్నారని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం, ఎన్​సీపీ నేత అజిత్​ పవార్​ కూడా గవర్నర్​ను కలిసే నేతల్లో ఉన్నట్లు స్పష్టం చేశారు.

''సంకీర్ణ కూటమిపై తప్పుడు ఆరోపణల వెనుక దాగిఉన్న నిజాలను గవర్నర్​ను ముందు ఉంచనున్నాం.''

- నానా పటోలే, కాంగ్రెస్​ సీనియర్​ నేత

అధికార ప్రభుత్వం గవర్నర్​ అపాయింట్​మెంట్​ తీసుకోలేదని.. రాజ్​భవన్​ వర్గాలు వెల్లడించాయి. ఆయన గురువారం రోజు.. నగరంలో ఉండట్లేదని సమాచారం.

'నివేదిక అందించండి'

బుధవారం.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​ నేతృత్వంలోని భాజపా బృందం గవర్నర్​ను కలిసింది. రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగేందుకు నైతిక అర్హత కోల్పోయిందని ధ్వజమెత్తారు ఫడణవీస్. సహచర భాజపా నేతలతో కలిసి గవర్నర్​కు మెమొరాండం సమర్పించారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఠాక్రే నోరు మెదపడం లేదని, అన్ని సమస్యలపై నివేదిక అందించేలా సీఎంను ఆదేశించాలని కోశ్యారీని కోరారు. అవినీతి ఆరోపణలతో పాటు అధికారుల బదిలీ అంశంపైనా దర్యాప్తు జరగాలని ఫడణవీస్ డిమాండ్ చేశారు.

'మాకు 175 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది'

ఫడణవీస్​ విమర్శలకు బదులిచ్చిన ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​.. ముఖ్యమంత్రి సరైన సమయంలో మాట్లాడతారని, నిరాధార ఆరోపణలు తగవని అన్నారు. తమ ప్రభుత్వానికి 175 మంది ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని, రాష్ట్రపతి పాలన ప్రశ్నే అనవసరమని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:'నైతిక అర్హత కోల్పోయిన మహా సర్కార్'

'లేఖ'పై మహా​లో ప్రకంపనలు- పవార్​ కీలక భేటీ!

ABOUT THE AUTHOR

...view details