తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రముఖ నటి దారుణ హత్య.. ఆస్తి కోసం కొడుకే పనిమనిషితో కలిసి.. - veena kapoor murder

ఓ ప్రముఖ నటిని తన కొడుకే హత్య చేశాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Actor Veena Kapoor murdered by son over property dispute
ప్రముఖ నటి వీణా కపూర్ దారుణ హత్య

By

Published : Dec 10, 2022, 1:51 PM IST

Updated : Dec 10, 2022, 2:00 PM IST

ప్రముఖ నటి వీణా కపూర్​(74)ను హత్య చేసిన ఘటన ముంబయిలో కలకలం రేపింది. ఆస్తి తగాదాల కారణంగా వీణా కపూర్​ను తన కొడుకే హత్య చేసినట్లు తెలుస్తోంది. తర్వాత ఆమె మృతదేహాన్ని మథేరన్ హిల్ స్టేషన్ సమీపంలో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో నిందితులుగా ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. నేరల్-మథేరన్ రోడ్డు వెంబడి గార్జ్ వద్ద ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రముఖ నటి వీణా కపూర్ కుమారుడు సచిన్ కపూర్.. మంగళవారం ఉదయం తన ఇంట్లో పనిమనిషితో కలిసి బేస్ బాల్ బ్యాట్‌తో ఆమెను కొట్టి చంపాడు. ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. సచిన్ కపూర్ ఒక నిరుద్యోగని, అతడి తల్లి వీణా కపూర్.. కోర్టులో ఆస్తి వివాదాలుపై పోరాడుతున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ప్రముఖ నటి వీణా కపూర్
Last Updated : Dec 10, 2022, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details