కరోనా టీకా రెండవ డోసు తీసుకున్న 28రోజుల వరకు రక్తదానం చేయకూడదని నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్(ఎన్బీటీసీ) వెల్లడించింది. అంటే తొలి డోసు తీసుకున్న 56రోజుల వరకు రక్తాన్ని దానం చేయడానికి వీలు లేదని అర్థం. ఏ రకమైన కరోనా టీకా తీసుకున్నా ఇదే నిబంధన వర్తిస్తుంది.
టీకా తీసుకున్నాం.. రక్తదానం ఎప్పుడు చేయొచ్చు?
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న 28రోజుల వరకు రక్తదానం చేయకూడదని నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ తెలిపింది. అంటే తొలి డోసు తీసుకున్న 56రోజుల వరకు రక్తదానం చేయడానికి వీళ్లేదు.
టీకా తీసుకున్న అప్పటివరకు రక్తదానం చేయకూడదు
ఈ విషయాన్ని ఎన్బీటీసీ డైరక్టర్ డాక్టర్ సునీల్ గుప్తా వెల్లడించారు. కాగా కరోనా నుంచి పూర్తి రోగనిరోధక శక్తిని సాధించాలంటే రెండు డోసులు టీకా తీసుకోవడం ముఖ్యమని ఇప్పటికే కేంద్ర వెద్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తొలి డోసు తీసుకున్న 28 రోజులు తర్వాత రెండవ డోసు తీసుకోవాలని పేర్కొంది. రెండో డోసు తీసుకున్న రెండు వారాలకు శరీరంలో యాంటీబాడీలు గణనీయంగా వృద్ది చెందుతాయని తెలిపింది.
ఇదీ చదవండి:'అందుబాటులోకి 70వేల 'ఆయుష్మాన్' కేంద్రాలు'
Last Updated : Mar 21, 2021, 7:48 PM IST