తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లవ్​ ట్రయాంగిల్​లో ట్విస్ట్​.. స్నేహితుడిని చంపి సూట్​కేస్​లో ఇరికించి.. రైల్వే స్టేషన్​లో.. - Body found in Jalandhar railway station

లవ్​ ట్రయాంగిల్​లో చిక్కుకున్న స్నేహితులు శత్రువులుగా మరారు. ఇంత కాలం కలిసి మెలిసి తిరిగిన ఆ ఇద్దరిలో ఒక్కరు ఇప్పుడు విగతజీవి అయ్యాడు. ప్రేమ కోసం ఓ వ్యక్తి తన స్నేహితుడినే హతమార్చిన ఘటన పంజాబ్​లోని జలంధర్​లో జరిగింది.

man killed his friend in jalandhar
man killed his friend in jalandhar

By

Published : Nov 17, 2022, 11:06 AM IST

లవ్​ ట్రయాంగిల్​లో చిక్కుకున్న ఇద్దరు మిత్రులు తాము ప్రేమించిన అమ్మాయి కోసం ఘర్షణకు దిగారు. ఇంతలో ఆగ్రహం చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడినే హతమార్చాడు. ఆ తర్వాత ఏమి ఎరుగనట్టు ఆ మృతదేహాన్ని సూట్​కేస్​లో పెట్టి దాన్ని రైల్వే స్టేషన్​లో వదిలి వెళ్లాడు. ఆ సూట్​కేసును గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో మృతదేహం ఉండటం చూసి పోలీసులు షాకయ్యారు. సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని ఇట్టే పట్టేసి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం... బిహార్​కు చెందిన ముహమ్మద్​ షామిమ్​తో అనే వ్యక్తి గాడీపుర్​లోని ఓ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. అతనితో పాటు మొహమ్మద్​ అష్ఫాక్ అనే వ్యక్తి కూడా అదే ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఇద్దరూ అక్కడే ఉన్న ఓ క్వార్టర్స్​లో నివసిస్తున్నారు. అదే ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళను షామీమ్​ ప్రేమించగా.. అఫ్షాక్​ సైతం ఆమెను ప్రేమించాడు.

మహిళను ప్రేమిస్తున్న విషయాన్ని షామిమ్​ తన స్నేహితుడు అష్ఫాక్​తో చెప్పాడు. అయినప్పటికీ.. అష్ఫాక్.. ఆ మహిళపై మనసుపారేసుకున్నాడు. ఈ విషయమై తరచూ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగేది. ఈ క్రమంలో బుధవారం ఆ ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా.. షామి​ను అష్ఫాక్​ హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకూదడని ఆ మృతదేహాన్ని ఓ సూట్​కేస్​లో పెట్టి జలంధర్​ రైల్వేస్టేషన్​లో వదిలి వెళ్లాడు. ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును చేధించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details